తెలంగాణ రాజకీయాలలో జగన్ వేలుపెడితే ప్రకంపనలే.. పవన్‌కళ్యాణ్ రంగంలో విలన్: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి!!
వైసిపి యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో చూద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాలలో జగన్ ప్రవేశిస్తే అక్కడ ప్రకంపనలు వస్తాయని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

జగన్ కు ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పింది అందుకే: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ దృష్టితోనే తాను జగన్ కు ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించానని పేర్కొన్న ఆయన, పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారని స్పష్టం చేశారు. 100 ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చిన సీఎం జగన్ ను వారు ఏమి చేయలేరని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది పొడిచేస్తుంది.. చించేస్తుంది అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారని, వాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏం చించుతారో... ఏం పొడుస్తారో తెలియదు కానీ, జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలు తలకిందులు అవుతాయని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవన్ కళ్యాణ్ రంగం సినిమాలో విలన్ లాంటోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రంగం సినిమాలో బయటకు హీరోలా నటిస్తూ లోపల విలన్ లాగా చేసే తంతును వివరిస్తూ, రంగం సినిమాలో విలన్ బయట ఉద్యమం అంటాడని, పోరాటం అంటాడని, లోపల ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని ఉంటాడని పవన్ కూడా అంతేనంటూ వివరించారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు, పేద ప్రజలను మోసం చేసింది ఎవరైనా ఉంటే అది చంద్రబాబు అని, చంద్రబాబును టార్గెట్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించారు.

పవన్ ఎలాంటి వాడో హైపర్ ఆది తెలుసుకోవాలి
ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. హైపర్ ఆది లాంటి వాళ్ళు తాము ఎటువంటి నాయకుల కింద పని చేస్తున్నామో గుర్తించాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కు కనీసం 175 నియోజకవర్గాల పేర్లు అయినా తెలుసా చెప్పాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని బూతులు తిట్టి, ఇక పవన్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనను బూతులు తిట్టేవాళ్లను చాలామందిని చూశానని వ్యాఖ్యానించారు.

తెలంగాణాలో జగన్ వేలు పెడితే మీకే కష్టం.. వార్నింగ్
హైపర్ ఆదిని కానీ, ఆ పార్టీకి చెందిన నేతలను కానీ తాను తప్పుపట్టనని ఆ పార్టీ నాయకత్వాన్నే తప్పుపడతానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూస్తే తెలంగాణ నుంచి సంచలనం సృష్టిస్తామని చెబుతున్న బి ఆర్ ఎస్ పార్టీ ని ఉద్దేశించి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో జగన్ వేలు పెడితే కష్టం అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు రంగం సినిమాలో విలన్ తో పోలుస్తూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications