కెసిఆర్ లాగా సిఎం కావాలని బైరెడ్డి కోరిక: శిల్పా మోహన్ రెడ్డి
కర్నూలు: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాదిరిగా ముఖ్యమంత్రి కావాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శిల్పామోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రత్యేక రాయలసీమ పేరుతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

గిరిజనుల ఆమోదంతోనే బాక్సెట్ తవ్వకాలు
గిరిజనుల ఆమోదంతోనే బాక్సైట్ తవ్వకాలు చేపడుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు చెప్పారు. గిరిజనుల సంస్కృతీసంప్రదాయాలకు, జీవనానికి ఏ మాత్రం విఘాతం కలిగించబోమని ఆయన బుధవారం గుంటూరులో అన్నారు.
ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలో బాక్సెట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సభ పెడుతామని అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. 2007లో వైయస్ రాజశేఖర రెడ్డి తన బినామీ పెన్నా ప్రతాపరెడ్డికి 224 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను దారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications