తెలంగాణ బిల్లుపై కేబినెట్ భేటీ: కావూరి డిసెంట్ నోట్
న్యూఢిల్లీ: ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం తెలంగాణ బిల్లు ఆమోదానికి ఏర్పాటైన మంత్రి వర్గ సమావేశంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు డిసెంట్ నోట్ సమర్పించారు. ఐదు పేజీలతో ఆయన ఈ నోట్‌ను మంత్రి వర్గ సమావేశానికి సమర్పించారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటైంది.
మంత్రివర్గ సమావేశంలో సివిల్ ఏవియేషన్ అథారిటీ బిల్లులో సవరణలకు ఆమోదంపై చర్చను ఎజెండాగా తీసుకున్నారు. తెలంగాణ బిల్లును కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే టేబుల్ ఐటంగా ప్రతిపాదించారు. తెలంగాణ బిల్లు ఆమోదానికే ప్రధానంగా ఈ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఎజెండా ఉండాలనే ఉద్దేశంతో సివిల్ ఏవియేషన్ అథారటి బిల్లు సవరణలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

మంత్రి వర్గ సమావేశానికి సీమాంధ్రకు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్‌లతో పాటు తెలంగాణకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే సాయంత్రం ఆరున్నర గంటలకు కాంగ్రెసు కోర్ కమిటీ జరగనుంది.
రాష్ట్ర విభజన విషయంలో బిల్లులో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యుల ప్రతిపాదించిన సవరణలకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదని తెలుస్తోంది. తెలంగాణ బిల్లును సోమవారంనాడు అంటే, ఈ నెల 10వ తేదీన పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపాదించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications