• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నాయుణ్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుణ్ని రాజకీయాల్లో ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన ఆ పార్టీ పనైపోయిందని, కేవలం 23 మంది ఎమ్మెల్యేలే గెలిచినంతమాత్రాన ఈసారి ఎన్నికల్లో కూడా అదేస్థాయిలో సీట్లు వస్తాయని అనుకోలేం. 2004లో కూడా ఇలాగే జరిగింది. 2009లోను ఓటమిపాలైనా 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి రాగలిగారు.

 రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం

రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం


రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ లేనంత అనుభవం ఆయన సొంతం. టీడీపీ కూడా అంత అకస్మాత్తుగా కూలిపోయే పార్టీ కాదు. నాయకులకన్నా కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది. బలమైన నాయకత్వం లేక తెలంగాణలో నామ్ కే వాస్తేగా మారిందనుకోవడమేకానీ బలమైన నాయకులుంటే ప్పటికీ ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సత్తా చూపించడానికి సిద్ధంగా ఉంది. పార్టీ వ్యవస్థాపకుడిగా సీనియర్ ఎన్టీఆర్ వేసిన పునాదులు అంత పటిష్టంగా ఉన్నాయి.

 దూరదృష్టి కలిగిన నేత

దూరదృష్టి కలిగిన నేత


పార్టీ అధినేత ఎన్టీఆర్ అంటే అభిమానమున్నవారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారు. అంతేకాక దూరదృష్టి కలిగిన రాజకీయవేత్తగా, ఒక విజన్ ఉన్న నేతగా, అభివృద్ధివైపు పార్టీని నడిపించే నాయకత్వ పటిమ చంద్రబాబు సొంతం. గత ఎన్నికల్లో 40 శాతానికి పైగా ఓటింగ్ పోలైంది. ఎవరు అవున్నా, కాదన్నా ఆయన విజన్ ను హైదరాబాద్ తో పోల్చిచూస్తారు. అంతటి నగరంపై ఆయన ముద్ర ప్రబలంగా ఉంది. అభివృద్ధి మొత్తం చంద్రబాబు ఒకే నగరంలో కేంద్రీకరించడంవల్ల ఇప్పుడు ఏపీ నష్టపోయిందికానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దాని వైభవం వేరు.

72 సంవత్సరాల వయసుతో యువతను ఆకట్టుకుంటున్నారు?

72 సంవత్సరాల వయసుతో యువతను ఆకట్టుకుంటున్నారు?


ఆయన ఎన్నికల బరిలోకి ఒంటరిగా వస్తారా? పొత్తుతో వస్తారా? అనేది కూడా చూడాలి. ఆయనకు గ్లామర్ లేదు. ఆయన పెద్ద వాక్శుద్ధి లేదు. ఆయనంటే అభిమానం చూపేవారు ఇంకా ఉన్నారు. 72 సంవత్సరాల వయసులో కూడా యువతరాన్ని ఆకట్టుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికీ తన హవాను చాటుతూనే ఉంది. రానున్న ఎన్నికల్లో ఆయన కూడా తనకు ఇదే చివరి ఛాన్స్ అంటూ కోరితే జనం కాదనరనే నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో ఉంది. మంత్రులకు వారి వారి నియోజకవర్గాల్లోనే పరిస్థితి కనాకష్టంగా ఉండగా వారు కుప్పం మీద ఫోకస్ చేయడమనేది ప్రకటనలకే పరిమితమవుతోంది. సంక్షేమ పథకాలు చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేవి కావని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏ విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టాలో తెలిసిన కాకలు తీరిన యోధుడని, అతణ్ని తక్కువ అంచనా వేస్తే దెబ్బతినడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

English summary
He has four decades of experience in politics like no other.TDP is also not a party that collapses so suddenly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X