• search

రాజధాని రైతుల్లో అసంతృప్తి సెగలు... ప్లాట్ల కేటాయింపు పత్రాల్లో ‘అసైన్డ్‌’పై గుస్సా ...

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమరావతి: రాజధాని రైతులు మరోసారి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈసారి వారి ఆగ్రహానికి కారణం రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వ వర్గీకరణ కారణమైంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లలో 'అస్సైన్డ్‌' అని పేర్కొనడంపై మండిపోతున్నారు.

  తాము భూములు ఎప్పుడో ఇచ్చినా ప్రభుత్వం నుంచి తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు దక్కించుకోవడానికి సుదీర్ఘకాలం వేచిచూడాల్సి వచ్చిందని చాలా మంది రైతులు
  అసంతృప్తితో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీ చేపట్టడంతో ఇంత ఆలస్యంగానైనా తమకు ప్రతిఫలం దక్కుతోందని రైతులు ఊరట చెందారు. అయితే ఆ రిటర్నటుల్ ప్లాట్లలో ప్రభుత్వం పేర్కొన్న ఒక్క పదం...ఒకే ఒక్క పదం రాజధానికి భూములిచ్చిన అసైన్డ్ రైతుల్లో అసంతృప్తి సెగలు భగ్గుమనేలా చేసింది.

  నిరీక్షణ ఫలించింది...కానీ...అంతలోనే...

  నిరీక్షణ ఫలించింది...కానీ...అంతలోనే...

  భూములు ఇచ్చిన దగ్గర్నుంచి ఎదురు చూపులు...సుదీర్ఘకాలం నిరీక్షణ...ఎన్నో మార్లు వాయిదాలు..తత్ఫలితంగా విపరీతమైన జాప్యం...ఇదీ నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి...అయితే ప్రభుత్వం ఎట్టకేలకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీ ప్రారంభించడంతో...ఎట్టకేలకు ఈ అవాంతరాలన్నీఅధిగమించి ప్రతిఫలమైన స్థలాలు చేతికి అందుతున్నాయని రైతుల మొహాల్లో ఆనందం కదలాడింది. అయితే అసైన్డ్ భూములిచ్చిన రాజధాని రైతులు రిటర్నబుల్ ప్లాట్ల పత్రాలను చూసుకొని ఒక్కసారిగా మొహాలు వేలాడేశారు.

  కారణమేమిటంటే...పత్రాల్లోని ఆ ఒక్క పదం...

  కారణమేమిటంటే...పత్రాల్లోని ఆ ఒక్క పదం...

  రాజధాని పరిధిలో భూములు పోయినా ప్లాట్లు దక్కాయని సంబంరపడదామనుకుంటే...తమకు కేటాయించిన పత్రాలు చూసుకున్న అసైన్డ్ రైతులకు ఆ సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. కారణం అసైన్డ్ రైతులకు కేటాయించిన భూముల పత్రాలపై ‘అస్సైన్డ్‌' అని పేర్కొనడమే. తమ భూమి పత్రాల్లో ఈ పదాన్ని చూసిన అసైన్డ్ రైతులు ఒక్కసారిగా గాలితీసిన బుడగల్లా అయిపోయారు... ప్రస్తావించడం తగదంటున్నారు. తమ పత్రాల్లో ఈ పదం ప్రత్యేకించి పేర్కొనడం వల్ల భవిష్యత్తులో తాము ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనేది ఈ రైతుల భావనగా తెలుస్తోంది.

  ఇబ్బందులే...ఎలా అంటే...

  ఇబ్బందులే...ఎలా అంటే...

  ఈ భూముల్లోనూ అస్సైన్డ్‌ భూములని ప్రత్యేకించి పేర్కొనడం ద్వారా సాధారణంగా అసైన్డ్ భూములకు సంబంధించిన నియమ నిబంధనలన్నీఈ భూములకూ వర్తిస్తాయని వారు భయపడుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ భూముల క్రయవిక్రయాల్లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, పైగా దర విషయంలోనూ మిగతా భూములకూ ఈ భూములకూ తీవ్ర వ్యత్యాసం ఉంటుందని...ఇది అన్యాయమనేది అసైన్డ్ రైతుల వాదన.

  ఇప్పటికే...ఆ పదం ఎఫెక్ట్...

  ఇప్పటికే...ఆ పదం ఎఫెక్ట్...

  రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవాలంటే... అసైన్డ్ భూముల నియమ నిబంధనలు ఈ ప్లాట్లకు వర్తిస్తాయనే సందేహంతో కొనుగోలుదారులు ఈ భూముల పట్ల ఆసక్తి చూపడం లేదని అసైన్డ్ రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితి తాము అసలు ఊహించలేదని...ఈ విధమైన వివక్షతతో ప్రభుత్వం తమకు అన్యాయం చేసినట్లే భావిస్తున్నామని అసైన్డ్ రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా భూములు అమ్ముకోవాలని చూసినా మిగిలిన ప్లాట్లతో పోలిస్తే తమ భూములను బాగా తక్కువ ధరలకే అడుగుతుండటం, అలా అమ్మడం వల్ల తాము తీవ్రంగా నష్టపోవడం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు.

  కావాలనే ఇలా...కాకుంటే అలా...చెయ్యండి మరి

  కావాలనే ఇలా...కాకుంటే అలా...చెయ్యండి మరి

  తమవి అసైన్డ్ భూములని...అందుకే ప్రభుత్వం ఈ విధంగా వివక్ష చూపిందని అసైన్డ్ రైతులు వాదిస్తున్నారు. అయితే తాము రాజధాని నిర్మాణం కోసం అడగ్గానే తమ జీవనాధారం అయిన భూములను వెనుకాముందు ఆలోచించకుండా ఇచ్చేశామని, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు...అలా అంత త్యాగం చేసిన మా పట్ల ఈ విధమైన బేధం చూపించడం న్యాయం కాదంటున్నారు. దీనినెక ఏమైనా కుట్ర ఉందేమోనన్న చందంగా మరి కొంతమంది రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ అసైన్డ్ అనే పదం సాకుగా చూపి తమ దగ్గర నుంచి భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి...ఆ తరువాత వాటిని సాధారణ భూములుగా క్రమబద్దీకరించుకుంటారని...అందుకే ఇలా చేశారని వారు వాదిస్తున్నారు...నిజంగా ఎలాంటి దురుద్దేశం లేకుంటే తమ రిటర్నబుల్ ప్లాట్ల పత్రాలపై ‘అస్సైన్డ్‌' అనే పదాన్నితొలగించాలని అస్సైన్డ్‌ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Amravati: AP Capital region assigned land farmers expressing dissatisfaction over returnable plots documents. “There is discrimination between the assigned farmers and other farmers...We cultivated all the commercial crops such as banana and turmeric as the upper caste farmers did until the lands were notified for the capital...so, why they mentioned that word 'assigned' in our documents...why is this discrimination”...some of those questioned.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more