'ఏపీకి రాజధాని, ఉప రాజధాని...: 5వేల దరఖాస్తులు'
అనంతపురం: రాజధాని, ఉప రాజధాని అంశాల ప్రతిపాదనలతో తాము కేంద్రానికి నివేదిక ఇస్తామని రాజధానిపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ మంగళవారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు పైన ఆగస్టు నెల లోపు కేంద్రానికి నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం కేంద్రానిదేనని చెప్పారు. రాజధాని ఏర్పాటుపై ఇప్పటి వరకు ఐదువేల దరఖాస్తులు అందాయని వెల్లడించింది.
రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు వంటి అంశాలను నివేదికలో పొందుపరుస్తామని చెప్పారు. భిన్నమైన ప్రతిపాదనలతో కూడిన నివేదిక రూపొందిస్తామని, అందరి సలహాలను తాము పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించింది. శివరామకృష్ణన్ వెంట కమిటీ సభ్యులు జగన్ షా, కెటి రవీంద్ర, నితిన్‌తో పాటు హైదరాబాదు పట్టణ ప్రణాళికా సంచాలకులు ఉన్నారు.
ముందుగా అనంతసాగరం చెరువును కమిటీ సభ్యులు పరిశీలించారు. ఆ తర్వాత అనంతపురం నగరంలో పర్యటించారు. బెంగళూరు హైవే, స్వాతంత్రోద్యమ కాలం నాటి క్లాక్ టవర్‌ను సందర్శించారు. అనంతరె రెవెన్యూ భవన్‌కు చేరుకొని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications