కించపరిచిన ఉదంతం: టీవీ9 రవి ప్రకాష్‌పై కేసు
హైదరాబాద్: తెలంగాణ రాష్టర్ ముఖ్యమంత్రిని, మంత్రులను, శాసనసభ్యులను కించపరిచేలా వార్తా కథనం ప్రసారం చేసిన ఉదంతం టీవి9 న్యూస్ చానెల్ సిఇవో రవిప్రకాష్‌ను వదిలేట్లు లేదు. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం ముగియడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిని, మంత్రులను, శాసనసభ్యులను కించపరిచే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా కథనం ప్రసారం చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది.
హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్‌లో రవిప్రకాష్‌పై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం - ఈ నెల 12వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలు, 9 గంటల మధ్య బుల్లెట్ న్యూస్ పేరిట టీవీ9 చానెల్‌లో కించపరిచే విధంగా వ్యాఖ్యలు ప్రసారం కావడంపై సుంకరి జనార్దన్ గౌడ్ అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌ను పరిశీలించిన రెండో మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ టీవీ9 సిఇవోపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రవిప్రకాష్‌పై సెక్షన్ 4ఎ, 6, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ యాక్ట్ 1995, 504, 505 ఐపిఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టీవీ9 ప్రసారాలపై తెలంగాణ ఎంఎస్‌వోలు ఇప్పటికీ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. టీవి9 ప్రసారాలు తెలంగాణ జిల్లాల్లో రావడం లేదు. అయితే, టీవి9తో పాటు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications