ద్వారంపూడిపై కేసు.. ఆయనే ఏ1..
కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన ఫోకస్ పెట్టింది. కాకినాడలో బియ్యం మాఫియా చెలరేగుతుందని, ద్వారంపూడి పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, కాకినాడలో కబ్జాలు చేసి ద్వారంపూడి రౌడీ రాజ్యాన్ని స్థాపించాడని ఆయన పైన టార్గెట్ చేసింది ఏపీ ప్రభుత్వం.
ద్వారంపూడిపై కేసు
దీంతో కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పైన తాజాగా కేసు నమోదు చేసింది. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ కట్టడాల పైన అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రధాన అర్చకుడు బళ్ల సూరిబాబు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు రాగా రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతకు పాల్పడ్డారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకున్న ద్వారంపూడి
నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవటంతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలకు దిగారు. ఈ కూల్చివేత సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరుడు సూరిబాబు తో పాటు మరికొంతమందితో వచ్చే కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. నానా హంగామా చేశారు. దీనితో మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ద్వారంపూడిని అరెస్ట్ చేశారు.
అధికారుల విధులకు ఆటంకం.. ఫిర్యాదుతో కేసు నమోదు
అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని, అనుచరులతో కలిసి అడ్డుకున్నారని మున్సిపల్ అధికారులు చేసిన ఫిర్యాదుతో ద్వారంపూడి ఆయన అనుచరుడు సూర్య బాబు తో పాటు మరో 24 మంది పైన కాకినాడ రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
ద్వారంపూడి ఏ 1.. ద్వారంపూడికి మొదలయినట్టే
ఈ కేసులో ఏవన్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, ఏ 2 గా బల్ల సూరిబాబు పేర్లను చేర్చారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరిన్ని కేసులను ఎదుర్కోవలసి వస్తుందని టిడిపి కూటమి నేతలు చెబుతున్నారు. గత ఐదేళ్ళలో ద్వారంపూడి చేసిన అరాచకాలు, అక్రమాల డేటా ఒక్కొక్కటి బయటకు వస్తుందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications