జగన్‌కు గట్టి షాక్: బెయిల్ సందర్భంలో.. నాలుగేళ్లకు తప్పుదిద్దుకున్న సిబిఐ!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో క్విడ్ ప్రోకోతో కార్మెల్‌కు సంబంధం అంశంపై నాలుగేళ్ల తర్వాత సిబిఐ తప్పును సరిదిద్దుకుందట .
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో క్విడ్ ప్రోకోతో కార్మెల్‌కు సంబంధం అంశంపై నాలుగేళ్ల తర్వాత సిబిఐ తప్పును సరిదిద్దుకుందట.

జగన్‌కు బెయిల్ మంజూరు, తప్పు దిద్దుకున్న సిబిఐ
ఈ మేరకు ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. జగన్ కేసులో నాలుగేళ్ల కిందట చేసిన తప్పును సరిదిద్దుకున్నట్లు పేర్కొన్నారు. నాడు జగన్‌కు బెయిల్ మంజూరైన సందర్భంలో కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేసింది. 2013 సెప్టెంబర్ 23న దానిని దాఖలు చేసింది.

క్విడ్ ప్రోకో నిర్ధారణ కాలేదని
కేసు దర్యాఫ్తు పూర్తయిందని, సండూరు పవర్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రయివేటు లిమిటెండ్ తదితర ఎనిమిది కంపెనీలకు క్విడ్ ప్రోకో వ్యవహారాలున్నట్లు నిర్ధారణ కాలేదని సిబిఐ అప్పుడు మెమోలో పేర్కొందని, ఇప్పుడు దానిని సరిదిద్దుకుందని పేర్కొంటున్నారు.
Recommended Video


అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది
2013లో మెమో దాఖలులో సిబిఐ చెప్పిన విషయాలు అందరినీ అశ్చర్యానికి గురి చేశాయని పేర్కొంటున్నారు. అప్పటికే సిబిఐ పది ఛార్జీషీట్లు జారీ చేసింది. వాటిలోని నాలుగు ఛార్జీషీట్లలో ఉన్న నిందితుల జాబితాలో కార్మెల్ ఏషియా కూడా ఉందని, ఆ తర్వాత మెమోలో క్విడ్ ప్రోకో లేదని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు.

ఇప్పుడేం జరిగిందంటే
తాజాగా ఈ ఏడాది ఆగస్టులో సిబిఐ మరో మెమో దాఖలు చేసిందని తెలుస్తోందని పేర్కొంది. ఇందులో క్విడ్ ప్రోకో వ్యవహారాలతో కార్మెల్ ఏషియాకు సంబంధం లేదన్న వాదన సరికాదని పేర్కొంది. నాడు అభియోగాలు నిర్ధారణ కాలేదన్న విషయం ప్రత్యేకించి సండూర్ కంపెనీకివి అని పేర్కొన్నారని తెలుస్తోంది.

నిందితుల జాబితాలోనే
సండూర్ పవర్ తన అనుబంధ కార్మెల్ ఏషియాతో కలసి ఐటీ, ఈడీ, కంపెనీల రిజిస్ట్రార్‌ల పరిధులకు సంబంధించిన వివిధ ఉల్లంఘలకు పాల్పడిందని, వాటిపై ఆయా శాఖలకు తదుపరి చర్య కోసం సమాచారం ఇచ్చామని కూడా వరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కార్మెల్‌ను నిందితుల జాబితాలో పేర్కొన్నట్లు చెప్పింది.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications