మాజీ డైరెక్టర్ రంజిత్‌తో సంబంధాలున్నాయా?: కోనేరు నివాసంలో సీబీఐ సోదాలు
ఎమ్మార్ కేసు నిందితుడు కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు ప్రదీప్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు చేస్తోంది.
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు ప్రదీప్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు చేస్తోంది.
ఢిల్లీ సీబీఐ బృందం జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ నివాసం, చెన్నైలోని ఆయన కార్యాలయంలో తనిఖీలు చేస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాతో సంబంధాలను ఆరా తీసేందుకు ప్రసాద్ ఇంట్లో సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం.

రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ బెయిల్ కోసం ఖురేషి అనే మాంసం వ్యాపారి ద్వారా ప్రదీప్ కలిశారని ఆరోపణలు ఉన్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రంజిత్ సిన్హా వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తుగా భాగంగా ప్రదీప్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications