వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసులో బిగ్ ట్విస్ట్-సీబీఐ కీలక నిర్ణయం ఢిల్లీ స్పెషల్ లాయర్-తేల్చేస్తారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోర్టుకు సీబీఐ ఓ కీలక విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులపై రోజువారీ విచారణ సాగుతున్న నేపథ్యంలో సీబీఐ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈడీ ఛార్జిషీట్ల విచారణ సాగుతుండటం, సీబీఐ ఛార్జిషీట్లపైనా విచారణ చేపట్టాల్సి ఉండటం, మరోవైపు తెలంగాణ హైకోర్టులోనూ నిందితులు కేసులు దాఖలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

జగన్ అక్రమాస్తుల కేసు

జగన్ అక్రమాస్తుల కేసు


ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా సాగుతోంది. ఇన్నాళ్లూ ఓ ఎత్తు, ఇప్పటి నుంచి ఓ ఎత్తు అన్నట్లుగా ఈ విచారణ సాగుతోంది. ఓవైపు సీబీఐ కోర్టులో సీబీఐ కేసులపై విచారణ, మరోవైపు తెలంగాణ హైకోర్టులో నిందితులు దాఖలు చేస్తున్న పిటిషన్లతో ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏ రోజు ఏ కోర్టు ఏ ఆదేశం ఇస్తుందో తెలియని పరిస్దితులు నెలకొంటున్నాయి. దీంతో నిందితులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వాదనలు సిద్దం చేసుకుంటున్న నిందితులు.. అందుకు అనుగుణంగా పిటిషన్ల దాఖలుకు ప్రయత్నిస్తున్నారు.

 దూకుడు పెంచిన సీబీఐ

దూకుడు పెంచిన సీబీఐ


ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు నమోదు చేసి దశాబ్దం పూర్తవుతున్నా ఇంకా ఈ కేసుల దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్న సీబీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులో దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సీబీఐకి, అలాగే విచారణలు ఏడాదిలోపు పూర్తి కావాలని ట్రయల్ కోర్టులకూ ఆదేశాలు ఇచ్చింతది. దీంతో తాజాగా సీబీఐ దూకుడు పెంచింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఛార్జిషీట్లతో పాటు ఈడీ ఛార్జిషీట్లు కూడా ఉండటం, అలాగే ఈడీ ఛార్జిషీట్లకు సీబీఐ ఛార్జిషీట్లే కీలకంగా మారిన నేపథ్యంలో సీబీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేస్తోంది.

ఢిల్లీ నుంచి ప్రత్యేక లాయర్

ఢిల్లీ నుంచి ప్రత్యేక లాయర్

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసుల కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించే ప్రతిపాదన ఉందని సీబీఐ కోర్టుకు సీబీఐ నిన్న తెలిపింది. ప్రత్యేక న్యాయవాది ప్రతిపాదన దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉందని సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వెల్లడించారు. రాంకీ ఫార్మా కేసు విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టుకు ఈ విషయం తెలిపారు. కొత్త లాయర్ వచ్చే వరకూ రాంకీ ఫార్మా కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీబీఐ న్యాయవాది సీబీఐ కోర్టును కోరారు. దీంతో సీబీఐ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

జగన్ కు తాజా ఝలక్

జగన్ కు తాజా ఝలక్

జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా ఉన్న పలు కేసుల్లో విచారణ ప్రస్తుతం సీబీఐ కోర్టులో కొనసాగుతోంది. ఇందులో
ఇందూ టెక్ జోన్ వ్యవహారంలో దర్యాప్తు స్టేటస్ తెలపాలని.. ఆ తర్వాతే తన డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తానని తాజాగా జగన్ మెమో దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ కోర్టు ఎప్పుడు తుది ఛార్జిషీట్ దాఖలు చేస్తారని సీబీఐని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సీబీఐ... ఇందూ టెక్ జోన్‌లో దర్యాప్తు పూర్తయిందని.. మరో ఛార్జషీట్‌ వేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో జగన్ తప్పనిసరిగా తన వాదన సిద్ధం చేసుకోవాల్సిన పరిస్దితి.

వాన్ పిక్ పై విజయసాయిరెడ్డి

వాన్ పిక్ పై విజయసాయిరెడ్డి


మరోవైపు వాన్‌పిక్‌ కేసులో దర్యాప్తు తాజా స్ధితి తెలపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. అవసరమైతే అదనపు పత్రాలు, అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ పేర్కొన్నందున దర్యాప్తు స్థితి తెలపాలని కోరారు. దీనిపై స్పందించిన సీబీఐ కోర్టు.. వాన్‌పిక్‌ కేసులో దర్యాప్తు స్థితి ఈనెల 15న తెలపాలని సీబీఐని ఆదేశించింది. జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. అటు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, నిమ్మగడ్డ ప్రసాద్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ అనేక అంశాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించలేదని పేర్కొంది. మంత్రి మండలిని తప్పుదోవ పట్టించి ప్రాజెక్టు పొందినట్లయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు రద్దు చేయలేదని.. తప్పుదోవ పట్టించిన అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని వాన్‌పిక్‌ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈనెల 15కి వాయిదా వేసింది.

Recommended Video

AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu
 సుప్రీం గడువులోగా తేల్చేస్తారా ?

సుప్రీం గడువులోగా తేల్చేస్తారా ?

ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులపై దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సీబీఐకి, ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టులకూ సుప్రీంకోర్టు తాజాగా మరోమారు సూచించింది. దీంతో ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో సాగుతోంది. సుప్రీంకోర్టు విధించిన గడువు ప్రకారం ఈ కేసులో విచారణ త్వరలో పూర్తయి తీర్పులు వెలువడాల్సి ఉంది. అయితే సీబీఐ, ఈడీ నత్తనడక దర్యాప్తు కారణంగా కోర్టులు కూడా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్ధితి ఉంది. అదే సమయంలో నిందితులు వరుసగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో విచారణ ఆలస్యమవుతోంది. అయినా సుప్రీంకోర్టు డెడ్ లైన్ మేరకు విచారణ పూర్తి చేసి తీర్పులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు, సీబీఐ కోర్టు కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐపైనా ఒత్తిడి పెరుగుతోంది.

English summary
the cbi has informed special cbi court as they have an idea of appoint a special advocate for ap cm ys jagan's assets cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X