వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్డీలపై పోస్టుల కేసు-హైకోర్టులో సీబీఐ తాజా అఫిడవిట్-పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రెడీ

|
Google Oneindia TeluguNews

ఏపీ హైకోర్టు తీర్పులు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ... మరో కీలక నిందితుడు పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. అమెరికాలో ఉన్నాడని భావిస్తున్న పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం ఇప్పటికే సీబీఐ ఇంటర్ పోల్ సాయంతో బ్లూ నోటీసులు జారీ చేయించింది. దీంతో ఎఫ్.బి.ఐ పంచ్ ప్రభాకర్ అడ్రస్, ఇతర వివరాలను సీబీఐకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైకోర్టులో సీబీఐ తాజాగా మరో అఫిడవిట్ దాఖలు చేసింది.

హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసు లో సి.బి.ఐ ఇవాళ తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ను హైకోర్టులో సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ దాఖలు చేశారు. ఇదే అఫిడవిట్ ను పిటిషనర్ల కు సైతం సీబీఐ పంపింది. న్యాయమూర్తులను కించపరిచే విధంగా పదే పదే వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్ కోసం నవంబర్ 1న లుక్ఔట్ సర్క్యులర్ హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేశామని అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది.
ఇంటర్ పోల్ జారీచేసిన బ్లూ నోటీసు ద్వారా అమెరికాలోని ఎఫ్ బి ఐ( ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అతని చిరునామాను పంపిందని సీబీఐ ఇందులో తెలిపింది. నవంబరు 8వ తేదీన పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ సంబంధిత కోర్టు నుంచి తీసుకున్న సీబీఐ.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

cbi to arrest ysrcp activist punch prabhakar in US soon in social media posts against judges cas

ఈనెల 9వ తేదీన ఇంటర్ పోల్ కు పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం సీబీఐ విజ్ఢప్తి పంపింది. ఆ తర్వాత కూడా ప్రభాకర్ అరెస్ట్ కు సంబంధించి ఇంటర్ పోల్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది. పంచ్ ప్రభాకర్ తాజా వీడియో లపై ఈనెల 15న యూట్యూబ్ ఛానల్ తో వర్చువల్ గా సమావేశమైన సిబిఐ అధికారులు.. యూట్యూబ్ ఛానల్స్ మొత్తాన్ని తొలగించాలని యూట్యూబ్ ను కోరారు. ఈ కేసులో సంబంధం ఉన్న మిగతా వారందర్నీ విచారిస్తున్నామని సీబీఐ హైకోర్టుకు వివరించింది. ఈ కేసులో 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్ పేరును చేర్చామని సి.బి.ఐ అఫిడవిట్లో పేర్కొంది.

English summary
the cbi has filed a fresh affidavit in social media posts against judges case in ap high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X