రైతులకు సిరులు కురిపించే శుభవార్త చెప్పిన కేంద్రం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా రైతులకు మద్దతు ధర కల్పించడం పైన కూడా ఫోకస్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసే పత్తికి మద్దతు ధరను ప్రకటించింది.

పత్తికి మద్దతు ధర
ఈసారి పత్తి రైతులకు 2025- 26 సంవత్సరంలో ఈ సీజన్ కోసం పొడవు పింజ పత్తికి క్వింటాలుకు 8,110 రూపాయలు, మధ్య పింజ పత్తికి క్వింటాల్ కు 7,710రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించింది. పత్తి కొనుగోళ్ల తర్వాత ఈ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా జమ అవుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

CCI gives money Directly into farmers accounts msp Rs 8 110 per quintal cotton Celebrate

Take a Poll

స్లాట్ బుక్ చేసుకుని సీసీఐకి పత్తి విక్రయాలు
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రకటించిన మద్దతు ధరలకు రైతులు తమ పంటను విక్రయించాలి అనుకుంటే 'కాపాస్ కిసాన్ యాప్' ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవాలి. యాప్ లో స్లాట్ బుకింగ్ సదుపాయం ఉండటంతో, రైతులు తమకు అనుకూలమైన స్లాట్ బుక్ చేసుకుని సులభంగా పంటలను అమ్ముకోవచ్చు. ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు 4.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు.

సీసీఐ ద్వారా పత్తి అమ్మాలంటే నమోదు తప్పనిసరి
పత్తి సాగు ద్వారా 7.12లక్షల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఈ పత్తిని స్టోర్ చేసుకోవడానికి రైతులకోసం మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులలో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు అధికారులు. అయితే పత్తికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర పొందాలంటే రైతులు రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలి. పంట అమ్మకాల కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ తప్పనిసరిగా ఇచ్చి నమోదు చేసుకోవాలి.

నేరుగా రైతుల ఖాతాలలోకే డబ్బులు
ఇక పత్తి పంట సాగు చేస్తున్న రైతులను గ్రామ వ్యవసాయ సహాయకులు ఆధార్ ఆధారిత ఈ పంట డేటా ద్వారా గుర్తిస్తారు. ఎవరైతే సిసిఐ ద్వారా అమ్ముకోవడానికి నమోదు చేసుకుంటారో వారికి బీమా సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుంది. cci పత్తిని కొనుగోలు చేసిన తర్వాత రైతుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులను చెల్లింపు చేస్తుంది. రవాణా వివరాలను యాప్లో నమోదు చేస్తే రవాణా దారులకు డబ్బులు నేరుగా బదిలీ చేస్తుంది.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రత్యేకంగా కమిటీలు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేయడానికి వారికి గిట్టుబాటు ధర కల్పించడానికి సీసీఐ ద్వారా కలుగుతున్న ఈ వెసులుబాటును రైతులకు అందించడానికి జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలుకు రైతులకు కావలసిన సహాయ సహకారాలను అందిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+