తిరుపతిలో క్లైమాక్స్ లో మామలు ఎంట్రీ, వీపు, ముడ్డి రెండు పగిలిపోయాయి. దొంగఓటు కాదు!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓట్లు వెయ్యడానికి ప్రజలు పోటీ పడ్డారు. బయట రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోని వారి సొంత ప్రాంతాలకు చేరుకుని ఓట్లు వేశారు. పండగలు, శుభకార్యాలకు కూడా సొంత ఊర్లకు రాని ప్రజలు కూడా ఈసారి సొంత ఊర్లకు చేరుకుని ఓటు వేశారు.
రెండు మూడు రోజుల ముందే సొంత ప్రాంతాలకు వచ్చిన ప్రజలు అసెంబ్లీ అభ్యర్థులు, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి అభిమాన నాయకులకు ఓటు వేశారు. పలు ప్రాంతాల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి కొందరు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. మెజారిటీ కోసం, ఓడిపోతాం అనే భయం ఉన్న నాయకులు కొందరు ఇతర ప్రాంతాల నుంచి వారు పోటీ చేస్తున్న నియోజక వర్గాలకు పిలిపించుకుని దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.

మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజక వర్గంలో దొంగ ఓట్లు వెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపించారు. ఏడు కొండల స్వామి కొలువు తీరిన తిరుమల కొండ కింద ఉన్న తిరుపతి నగరంలో వైసీపీ నాయకులు ఇతర ప్రాంతాల నుంచి చాలా మందిని పిలిపించి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించారని జనసేన, బీజేపీ నాయకులు ఆరోపించారు.
తిరుపతిలోని 13వ వార్డులోని పోలింగ్ బూత్ నెంబర్లు 141, 142, 143 ల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన కొందరిని బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పదేపదే గొంగ ఓట్లు వెయ్యడానికి కొందరు రావడంతో ఆ బూత్ ల్లో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తరవాత సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు కత్తులు, కర్రలు తీసుకు వచ్చి మమ్మల్ని బెదిరించి తమ మీద దాడి చేశారని బీజేపీ, జనసేన నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వైసీపీ నాయకుల తీరుతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు వైసీపీ నాయకులకు అమ్ముడుపోయి దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని పట్టుకోకుండా చూసిచూడనట్లు వదిలేశారని, వెంటనే కేంద్ర బలగాలను రప్పించాలని కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు.
సమాచారం తెలుసుకున్న ఎన్నికల అధికారులు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు, మరోసారి దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన కొందరిని కేంద్ర బలగాలు పట్టుకున్నారు. దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన ఇద్దరిని రోడ్డు మీద మోకాళ్ల మీద కుర్చోబెట్టి లాఠీలతో వీపు, ముడ్డి పగిలిపోయేలా బడితపూజ చేశారు. దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిని వారిని అదుపులోకి తీసుకున్న కేంద్ర బలగాలు వారిని ఎన్నికల అధికారులకు అప్పగించారు.
-
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications