పవన్ కోసం లాఠీ దెబ్బలు! ఎపికి కేంద్రం విద్యుత్ కానుక
విజయవాడ/గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. పవన్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
ఎపికి కేంద్రం కానుక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కానుక ఇచ్చింది. ఎపికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. కాగా, చంద్రబాబు ప్రమాణానికి వచ్చిన కేంద్రమంత్రి పీయూష్ గోషల్ మాట్లాడుతూ... బిల్లులో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.

అన్యాయం నిజమే: అద్వానీ
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది వాస్తవమేనని బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ చెప్పారు. బాబు హయాంలో ఎపికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆయన పరిపాలనాధ్యక్షుడని, రాజకీయ అనుభవం కలిగిన నేత అన్నారు. బిల్లు సమయంలో ఎపికి అన్యాయం జరిగిందని చెప్పారు.
కేంద్రం సహకారం: వసుంధర
ఎపి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని రాజస్థాన్ సిఎం వసుంధరా రాజే అన్నారు. బాబుకు అభినందనలు తెలిపారు. రాజధాని నిర్మాణానికి సహకారం ఉంటుందన్నారు.
సహజవనరులు: నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సహజవనరులు ఉన్నాయని మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ చెప్పారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలకు, ఐటి ఇండస్ట్రియల్ సెక్టార్‌కు ఎపి అనుకూలమన్నారు. ఎపిలో పోర్టులు నిర్మిస్తామని చెప్పారు. చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications