చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ కేంద్రం భారీ గిఫ్ట్..!!

కేంద్రం నుంచి ఏపీకి బిగ్ అప్డేట్ అందింది. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పోలవరం నిధుల విషయం లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పీఎం మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాల పైన చర్చించారు. ఇదే సమయంలో కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం ఒకే సారి రూ 2,800 కోట్లను విడుదల చేసింది. అందులో రూ 2,000 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం భారీ ఊరట ఇవ్వనుంది.

పోలవరం నిధులు
కేంద్రం ఏపీకి సంబంధించిన అంశాల్లో వేగంగా స్పందిస్తోంది. పోలవరం సవరించిన అంచనాలకు కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా ప్రస్తుతం పోలవరం పనుల కోసం రూ 2,000 కోట్లు అడ్వాన్స్ గా విడుదల చేసింది. అదే సమయంలో రీయంబర్స్ మెంట్ కింద మరో రూ 800 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో, పోలవరం ప్రాజెక్టుకు ఇంత భారీ మొత్తంగా ఏకంగా రూ 2,800 కోట్లు విడుదల చేయటంతో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దక్కనుంది.

Central releases Rs 2 800 cr for Polavaram first phase works

ఏపీ ప్రభుత్వ వినతి
2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే..ఆ తరువాత కేంద్రం ఆ మొత్తాన్ని రీయంబర్స్ చేస్తోంది. దశల వారీగా ఈ నిధులను కేంద్రం గత కొన్నేళ్లుగా విడుదల చేస్తోంది. అయితే, కొంత కాలంగా పోలవరం నిర్మాణంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఒక సీజన్ నష్ట పోకుండా పనులు చేయాలంటే ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని కోరుతోంది. దీంతో, తాజాగా కేంద్రం పోలవరం కు తొలి సారిగా అడ్వాన్స్ కింద రూ 2 వేల కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Central releases Rs 2 800 cr for Polavaram first phase works

అడ్వాన్స్ నిధులు
కేంద్రం నెల రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రూ 12,157 కోట్లు మేర కొత్త డీపీఆర్ కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ 30,436 కోట్లతో ఈ డీపీఆర్ కు ఆమోదం తెలపగా.. అందులో గతంలో ఇచ్చిన నిధులు పోనూ రూ 12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా ఏపీకి దక్కనున్నాయి. అందులో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 6 వేల కోట్లు, వచ్చే ఏడాది రూ 6,157 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో భాగంగానే ప్రస్తుతం రూ 2 వేల కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+