కేంద్రం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ - ఎన్నికల వేళ రిలీఫ్..!!
ఏపీకి ఈ ఆర్దిక సంవత్సరంలో కేంద్రం నుంచి వరుసగా నిధులు అందుతున్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఆర్డికంగా తోడ్పాటు అందుతోంది. రాష్ట్రానికి రావాల్సిన వాటాలే అయినా ఇప్పుడు.. ప్రభుత్వానికి రిలీఫ్ గా మారుతోంది. దేశ వ్యాప్తంగా ఈ సారి వస్తు..సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. జూన్ నెలలో రై 1,61,497 కోట్లు వసూలయినట్లు కేంద్ర ఆర్దిక శాఖ ప్రకటించింది. ఇందులో రాష్ట్రాల వాటాను కేంద్రం ప్రకటించింది.
జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో ఏకంగా 1.61 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది వసూళ్లతో పోల్చితే 11.7 శాతం ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. గత నెల వసూళ్లతో పోల్చితే 2.8 శాతం అధికంగా ఉన్నాయి. గత నాలుగైదు నెలలుగా ప్రతి నెలా 1.5 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు వస్తున్నాయి. జూన్ నెలలో వసూలైన మొత్తం ఇప్పటి వరకు వసూలైన అత్యధిక కలెక్షన్లలో మూడో స్థానంలో నిలిచింది. జూన్ నెలలో వసూలైన మొత్తంతో సెంట్రల్ జీఎస్టీ Rs 31,013 కోట్లు, స్టేట్ జీఎస్టీ Rs 38,292 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ Rs 80,292 కోట్లు, కంపెన్‌సేషన్ సెస్ ద్వారా Rs 11,900 కోట్లు వసూలయ్యాయి.

సరిగ్గా ఆరేళ్ల క్రితం జీఎస్టీ విధానం మొదలయింది. అప్పటి నుంచి ప్రతి నెలా లక్షలాది రూపాయలు వసూళు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రూ 4,681.39 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. గత ఏడాది రూ 3,901.45 కోట్లతో పోలిస్తే 20 శాతం పెరిగాయి. గత ఏడాది ఏపీలో రూ 2,986.52 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది జూన్ లో రూ 3,477.42 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి.గత ఏడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. ఇక, జూన్ నెలలో రాష్ట్రాలకు ఈ మొత్తం వసూళ్లలో వచ్చే వాటాను ఆర్దిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు నిధులను కేటాయించింది.
అందులో భాగంగా జూన్ నెల వసూళ్ల ప్రకారం ఏపీకి రూ 1,159.88 కోట్ల మేర వాటాగా నిధులు దక్కనున్నాయి.తెలంగాణ రాష్ట్రానికి రూ 1,621.37 కోట్లు రానున్నాయి. అదే విధంగా ఉత్తరప్రదేశ్ కు రూ 3,236.11 కోట్లు, ఆ తరువాతి స్థానంలో మహారాష్ట్రకు3,484.55 కోట్లు కేటాయించారు. రాష్ట్రాల వాటాగా మొత్తంగా రూ 30,268 కోట్లు రాష్ట్రాల వాటాగా విడుదల కానుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్దిక సంవత్సరంలో రుణ పరిమితి.. రెవిన్యూ లోటు నిధులు..కేంద్రం..రాష్ట్రం పన్నుల వాటాలో రావాల్సిన నిధులు..ఇలా వరుసగా ఏపీకి నిధులు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications