ఆ నివేదిక అసమగ్రం: సందేహాలు తీర్చండి.. ఏపీ సర్కార్‌కు కేంద్రం 12 ప్రశ్నలు.. 23న గడ్కరీ రాక

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అంచనాలు సమగ్రంగా లేవని కేంద్రప్రభుత్వం వెనక్కు పంపింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి మొత్తం రూ.58,319 కోట్లు ఖర్చవుతాయని గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం ఆగస్టు నెలలో నివేదిక సమర్పించింది.

కానీ ఈ అంచనాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ.. పలు సందేహాలు లేవనెత్తుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ నివేదికను కేంద్ర జలసంఘం వారం క్రితం తిప్పి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలపై దాదాపు 12 ప్రశ్నలు సంధించింది. ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి అంచనాలు మార్చి పంపాలని కోరింది.

 గత ఆగస్టులో కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్

గత ఆగస్టులో కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్

కేంద్ర జల సంఘం అధికారులు లేవనెత్తిన అభ్యంతరాల మేరకు పోలవరం ప్రాజెక్టు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలవరంపై 2013-14 లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కేంద్రం తిరిగి చెల్లిస్తుందని ఇప్పటికే హామీ ఇచ్చింది. దీంతో పలు నెలల పాటు కసరత్తుచేసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో చర్చించి వారి సూచనలను పాటిస్తూ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా మేరకు ఎంత ఖర్చవుతుంది?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా మేరకు ఎంత ఖర్చవుతుంది?

పోలవరం ఎడమ కాలువ, కుడి కాలువ, ప్రధాన పనులకు 2015-16 లెక్కలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రానికి సమర్పించిన 2013-14 అంచనాలు అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఉన్నాయని, కారణాలు ఏమిటో తెలియజేయాలని అడిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) అంచనాల ప్రకారం లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చవుతుందని భావిస్తున్నారో ఆ లెక్కలు తెలియజేయమంది.

 పోలవరం ఉభయ కాలువల నిర్మాణం పురోగతి మాటేమిటి?

పోలవరం ఉభయ కాలువల నిర్మాణం పురోగతి మాటేమిటి?

తాజా అంచనాలు కూడా సవరించిన తర్వాత మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడి వ్యయం- లాభం నిష్పత్తి ఏ స్థాయిలో ఉంటుందో కూడా విశ్లేషించి ఆ వివరాలు కూడా పంపాలని కేంద్రం సూచించింది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం, కుడి ఎడమ కాలువలలో జరిగిన మొత్తం పని ప్లస్ పూర్తి కావాల్సిన పని పరిమాణాలను పేర్కొంటూ పూర్తయిన పనికి అయిన ఖర్చు, చేయబోయే పనికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు విడివిడిగా రూపొందించి పంపాలని కోరింది.

 పునరావాసంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని సలహా

పునరావాసంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని సలహా

బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన ‘పోలవరం'లో విద్యుత్కేంద్రం నిర్మాణానికి తాజాగా ఎంత ఖర్చవుతుందని లెక్కిస్తున్నారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఈ అంచనాలను నేరుగా పంపవద్దని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా తనిఖీ చేయించి పంపాలని కూడా సూచించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణతోపాటు నిర్వాసితులకు ఏ మేరకు ఖర్చవుతుందో తెలియజేయాలని మరింత సమగ్ర సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం కోరింది.

 టెండర్ల ప్రక్రియ యధాతథమన్న ఏపీ అధికారులు

టెండర్ల ప్రక్రియ యధాతథమన్న ఏపీ అధికారులు

పోలవరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శల మాటెలా ఉన్నా.. సుమారు రూ.1483 కోట్ల మేర పిలిచిన టెండర్ల గడువు మరికొంత కాలం పెంచుతామని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుత గుత్తేదారుకు మరో నెల రోజులు గడువు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెండర్ ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తూనే, దాని గడువును పెంచనున్నామని ఏపీ అధికారులు తెలిపారు. పోలవరం పనుల వేగం పెంచేందుకు రాష్ట్రం సూచించిన ఆరు ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు, గడ్కరీ కూలంకషంగా చర్చించారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఐదు ప్రతిపాదనలపై చర్చించి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. తాజాగా ఆరో ప్రతిపాదన జోడించి కేంద్రమంత్రి వద్ద చర్చలు జరిపారు. గడ్కరీతో సీఎం సమావేశంలో ఉన్నతాధికారులు తప్ప వేరే ఎవరినీ అనుమతించలేదు.

 గుత్తేదారు కోర్కెలు తీర్చడం అసాధ్యమని తేల్చేసిన త్రిసభ్య కమిటి

గుత్తేదారు కోర్కెలు తీర్చడం అసాధ్యమని తేల్చేసిన త్రిసభ్య కమిటి

సకాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి కేంద్ర మంత్రి గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు రెండుసార్లు విడివిడిగా చర్చలు జరిపారు. మధ్య మధ్యలో అధికారులతో కలిసి చర్చించారు. గుత్తేదారు ఆర్థిక సమస్యల చర్చించిన త్రిసభ్య కమిటీ తమ నిర్ణయాన్ని కేంద్రమంత్రికి తెలియజేసింది. గుత్తేదారుతో ఒప్పందాన్ని, షరతులను పరిశీలించాక ఒప్పందం పరిధిలో గుత్తేదారు కోర్కెలను పరిష్కరించడం అసాధ్యమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రతిపాదించిన ఆరు అంశాలు చర్చకు వచ్చాయి. ఎలాగూ 60సి కింద టెండర్లు ఆహ్వానించినందున దానికే మొగ్గు చూపి, గుత్తేదారుకు మరో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. చివర్లో ప్రస్తుత గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ ఎండీని పిలిచి ఈ సంగతి చెప్పారు.

 23న పోలవరం వద్దకు రానున్న కేంద్రమంత్రి గడ్కరీ

23న పోలవరం వద్దకు రానున్న కేంద్రమంత్రి గడ్కరీ

పనుల వేగం పెంచేందుకు తమకు రెండు నెలల గడువు ఇవ్వాలని ఆ ట్రాన్స్‌టాయ్ సంస్థ ఎండీ కోరారు. వరద వచ్చేలోపు స్పిల్‌‌వే వేగం పెంచాల్సి ఉన్నందున అంత గడువు ఇవ్వడం అసాధ్యమని చెప్పి, అధికారులు నెలరోజుల గడువు ఇచ్చారు. ఆ లోగా పని పూర్తి కాకపోతే కొత్తవారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఈ నెల 23న కేంద్ర మంత్రి గడ్కరీ రానున్నారు. ప్రతి 15 రోజులకోసారి పోలవరంపై కేంద్ర మంత్రి సమీక్షించడమో, ప్రాజెక్టు వద్దకు రావడమో చేస్తారని తెలిసింది. మరో నాలుగు రోజుల్లో ఎగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించి స్పష్టత రానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+