పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లే ? పార్లమెంట్ లో కేంద్రం షాకింగ్ ప్రకటన..!
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. పదేళ్ల క్రితం జాతీయ హోదా ఇచ్చి తామే నిర్మాణం చేసి ఇస్తామని ప్రకటించిన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటివరకూ కొలిక్కిరాలేదు. ఐదేళ్లుగా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలుస్తున్నా ఫలితం మాత్రం లేదు. ఈ క్రమంలో ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయి. వీటిని ఎలా సరిదిద్దాలో తెలియక తలలు పట్టుకుంటున్న వేళ.. కేంద్రం మరో షాక్ ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తికి 2026 మార్చి నెలను తాజా గడువుగా నిర్ణయించింది. అంటే 2026కి కేవలం తొలి దశ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుందన్న మాట. ఇక మిగతా దశల మాట దేవుడెరుగు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంట్లో ప్రకటన చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఇంకా తొలి దశ పూర్తి కావడానికి మరో రెండేళ్ల గడువు పెట్టిందంటే దీనిపై కేంద్రం నిర్లక్ష్యం ఏంటో అర్ధమవుతోంది. అయినా రాష్ట్రం నుంచి గట్టిగా పోరాడలేని పరిస్ధితి నెలకొంది.













Click it and Unblock the Notifications