జగన్ కు కేంద్రం మరో షాక్ -ఈసారి రైల్వే ప్రాజెక్టుల వంతు- పార్లమెంటులో తేల్చేసిన వైనం..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకూ చెప్పుకోదగిన స్ధాయిలో రైల్వే ప్రాజెక్టుల్ని కేంద్రం నుంచి సాధించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్రం ఇస్తున్న ప్రాజెక్టులకు సైతం తమ వాటాగా విడదల చేయాల్సిన నిధుల్ని కూడా ఇవ్వకపోవడంతో అవి కూడా నిలిచిపోయే పరిస్ధితి వచ్చేస్తోంది. దీంతో ఇప్పటికే పలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి షాకులిస్తున్న కేంద్రం.. తాజాగా రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ భారీ ఝలక్ ఇచ్చింది.

ఏపీ రైల్వే ప్రాజెక్టులు
ఏపీలో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన పదుల కొద్దీ రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కేంద్రం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా నిధులు కేటాయిస్తే.. సదరు ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కానీ వైసీపీ సర్కార్ భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమం కారణంగా ఆయా ప్రాజెక్టులకు తమ వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇచ్చే పరిస్ధితి లేకుండా పోతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా మూలనపడుతున్నాయి. వాటిని తిరిగి కేంద్రం సాయంతో గాడిన పెట్టించాలని భావిస్తున్న వైసీపీ .. ఇప్పుడు వాటిపై పార్లమెంటులో తమ ఎంపీలతో ప్రశ్నలు వేయిస్తోంది.

వైసీపీకి కేంద్రం షాక్
ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ బందరు ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని ఆయన అడిగారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కుండబద్దలు కొట్టేశారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు ఇవ్వనిదే ఈ ప్రాజెక్టులపై తాము ముందుకు వెళ్లలేమన్నారు. దీంతో వైసీపీ సర్కార్ కు గట్టి షాక్ తగిలినట్లయింది.

రూ.1700 కోట్లు ఇస్తేనే కొత్త ప్రాజెక్టులు..
ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు ఇచ్చి తీరాల్సిందేనని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటివరకూ పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా రూ.1798 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. దీన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. కాబట్టి కొత్తగా ఏపీలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టే పరిస్ధితి లేదన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయించుకోవాలన్న వైసీపీ ఎత్తుగడ నెరవేరలేదు. అదే సమయంలో కేంద్రానికి పూర్తి మద్దతునిస్తున్న వైసీపీ విషయంలో బీజేపీ వైఖరి కూడా మరోసారి బయటపడింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications