ఏపీకి ప్రత్యేక హోదా..! పార్లమెంటులో కేంద్రం మరో ప్రకటన..!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాజాగా కూడా సీఎం జగన్ మరోసారి ప్రధాని మోడీకి ఢిల్లీలో విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కేటాయింపు అంశం ఇవాళ మరోసారి పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ ఎంపీలు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ (nityanand rai)ను ఈ హామీపై మరోసారి ప్రశ్నించారు. దీంతో ఆయన ప్రత్యేక హోదాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కేటాయింపుపై వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనంటూ పాత పాటే పాడారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గతంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రాల ఆర్ధికలోటు భర్తీకి 14వ ఆర్ధిక సంఘం నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. దీంతో ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించిన అంశాన్ని నిత్యానందరాయ్ మరోసారి పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. ఈ ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా తెలిపారు. మరోవైపు తాజాగా ప్రధాని మోడీని కలిసిన సీఎం జగన్ .. ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ఆయన దృష్టికి తెచ్చారు. కానీ జగన్ కు ఎప్పుడు ప్రధాని మోడీ మాత్రం ఇది ముగిసిన అధ్యాయంగా చెప్పడం లేదు. దీంతో వైసీపీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications