వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన హామీలపై కేంద్రం హ్యాండ్సప్- జగన్ కంటే చంద్రబాబుకే సమస్య- ఎలాగో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇచ్చిన విభజన హామీల్ని చంద్రబాబు కేంద్రంతో అమలు చేయించడంలో విఫలమయ్యారన్న కారణంతో తనకు మెజారిటీ ఇమ్మని కోరి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కు వరుస షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని ఎప్పుడో పక్కనబెట్టేసిన కేంద్రం, ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ పైనా చేతులెత్తేయడంతో జగన్ ఇరుకునపడ్డారు. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో జగన్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు ఆశలపై మాత్రం కేంద్రం నీళ్లు చల్లినట్లయింది.

ఏపీకి కేంద్రం హ్యాండ్

ఏపీకి కేంద్రం హ్యాండ్

ఏపీకి గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ సర్కార్ ఇచ్చిన హామీల అమలులో ఎక్కడ లేని అలసత్వం చూపుతున్న ఎన్డీయే సర్కార్ తాజాగా రైల్వే జోన్ నిరాకరణ ద్వారా తన నైజాన్ని చాటుకుంది. నిన్న హోంశాఖ నిర్వహించిన విభజన సమస్యల పరిష్కార సమావేశంలో రైల్వే జోన్ పై కేంద్రం చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం పూర్తిగా మొదటికొచ్చినట్లయింది. దీంతో కేంద్రం తీరుపై రాష్ట్రంలో మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో అధికార, విపక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇరుకునపడ్డాయి.

 జగన్, చంద్రబాబుపై ఎఫెక్ట్

జగన్, చంద్రబాబుపై ఎఫెక్ట్


కేంద్రం వరుసగా విభజన హామీల్ని ఉల్లంఘిస్తున్నా బీజేపీకి బేషరతు మద్దతుగా నిలుస్తున్న జగన్, చంద్రబాబు తాజాగా రైల్వే జోన్ నిరాకరణతో మరోసారి ఇరుకునపడ్డారు. ఇప్పుడు దీనిపై పరస్పర విమర్శలు చేసుకోలేక, అలాగని కేంద్రాన్ని విమర్శించలేక వీరిద్దరూ తోడు దొంగల్లా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా మరోసారి రాష్ట్రంలో విభజన హామీల్ని కేంద్రంతో అమలు చేయిస్తామన్న హామీ ఇవ్వాలంటేనే వీరు భయపడే పరిస్ధితులు తలెత్తుతున్నాయి. బీజేపీతో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ తో పాటు బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబుకూ ఇది శరాఘాతమే.

జగన్ కంటే చంద్రబాబుపైనే ?

జగన్ కంటే చంద్రబాబుపైనే ?

విభజన హామీలు అమలు చేయని కేంద్రం నుంచి బయటికి వచ్చి రాజకీయంగా నష్టపోయిన చంద్రబాబు మరోసారి అదే బీజేపీతో పొత్తు కోసం మూడేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తోడు లేకపోవడంతో నష్టపోయినట్లు గ్రహించి ఆ పార్టీతో పొత్తు కోసం అర్రులు చాస్తున్నారు. అయితే జగన్ మాత్రం బీజేపీకి కేవలం రాష్ట్ర అవసరాల కోణంలోనే మద్దతిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ విషయంలో జగన్ కాస్త సేఫ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలాగని కేంద్రంతో విభజన హామీలు అమలు చేయించే బాధ్యత నుంచి జగన్ కూడా తప్పించుకోలేరు. కానీ భవిష్యత్తులో బీజేపీతో నేరుగా పొత్తు కోరుకుంటున్న చంద్రబాబుపై ఈ ప్రభావం ఎక్కువగా పడబోతోంది. అదే జరిగితే జగన్ సేఫ్ కావడం తథ్యమన్న వాదన కూడా వినిపిస్తోంది.

English summary
central govt's latest denial of promises given to andhrapradesh on state division seems to irk cm ys jagan and tdp chief chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X