ఏపీకి కేంద్రం మరో షాక్, రెండ్రోజుల్లోనే రివర్స్: పోలవరంకు ప్రాజెక్టుకు భారీ కోత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.పద్నాలుగు వందల కోట్లు ఇవ్వాలని తొలుత చెప్పినప్పటికీ, ఆ తర్వాత దాదాపు రూ.11 వందల కోట్లకే మొగ్గు చూపిస్తోందని తెలుస్తోంది.
నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు తొలుత కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. కానీ రెండు రోజుల్లోనే మాట తప్పింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.1089 కోట్లు మాత్రమే ఇవ్వాలను జలనవరుల శాఖ ఆదేశించిందని తెలుస్తోంది.

దీంతో రూ.300 కోట్లకు పైగా పోలవరానికి కేంద్రం కోత పెట్టింది. రెండు రోజుల క్రితమే పద్నాలుగు వందల కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కానీ ఇప్పుడు దానిని రూ.1089కి పరిమితం చేసింది.












Click it and Unblock the Notifications