త్వరలో విశాఖ రైల్వే జోన్‌కు పచ్చజెండా, ఇన్నాళ్లు టీడీపీయే అడ్డుకుంది: విష్ణు
అమరావతి: కడపకు ఉక్కు పరిశ్రమ, విశాఖపట్నంకు రైల్వే జోన్ రాకుండా అడ్డుకున్నది టీడీపీయేనని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ బుధవారం మండిపడ్డారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం కోసం వారు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వం కార్పోరేషన్ ప్రారంభించకుండా ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోను రాకుండా అడ్డుకునేది టీడీపీయే అన్నారు. నాలుగు డివిజన్లు కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని, దీనిపై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, రాష్ట్రం కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టు మొత్తం తామే పూర్తి చేస్తామని చంద్రబాబు గొప్పలకు పోవడం విడ్డూరమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు.

సర్పంచ్‌ల చెక్ పవర్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. సొంత పార్టీ సర్పంచ్‌లో ముఖ్యమంత్రిపై తిరగబడ్డారన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన సరికాదన్నారు. అభివృద్ధిని నిరోధించే ప్రయత్నమే ప్రత్యేక ఆఫీసర్ల పాలన అని విమర్శించారు.
నరేగా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం చేసిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని తాము కోరామన్నారు. విచారణ పూర్తయితే లోకేష్‌కు వచ్చిన అవార్డులు వెనక్కి తీసుకునే పరిస్థితి అన్నారు. కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు ఎవరినీ సంప్రదించకుండా 9 నెలలుగా ఆరాటం, పోరాటం అంటున్నారని ఎద్దేవా చేశారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications