వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన హిందూ మహా సభ చైర్మన్ చక్రపాణి మహారాజ్ .. ఏ విషయంలో అంటే

|
Google Oneindia TeluguNews

వైసీపీ ప్రభుత్వాన్ని హిందూ మహా సభ చైర్మన్ చక్రపాణి మహారాజ్ హెచ్చరిస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం మంచిది కాదని ఆయన తెలిపారు. రాజధాని రైతులకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. హిందూ సంస్కృతికి పట్టుగొమ్మ అయిన అమరావతి తరలింపును తాము వ్యతిరేకిస్తున్నామని హిందూ మహా సభ చైర్మన్ ప్రకటించారు.

రాజధాని అమరావతి పోరాటం... మనస్తాపంతో ఆగిన మరో రైతు గుండెరాజధాని అమరావతి పోరాటం... మనస్తాపంతో ఆగిన మరో రైతు గుండె

ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని 22 రోజులుగా రాజధాని రైతుల పోరాటం సాగుతుంది. రాజధాని రైతులకు పలు రాజకీయ వర్గాల నుండే కాకుండా,పలు ధార్మిక సంస్థల నుండి కూడా మద్దతు లభిస్తుంది. రాజధాని అమరావతిని నుంచి మారిస్తే ఊరుకునేది లేదని హిందూమహాసభ ఛైర్మన్‌ చక్రపాణి మహరాజ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ లక్షలాది రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాజధాని అమరావతిని మార్చాలనే నిర్ణయం చాలా తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.

Chakrapani Maharaj Chairman of Hindu Maha Sabha, warned the YCP government..why because

రాజధాని కోసం రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు ఇంతలా పోరాడుతున్నారని, వారిని ఆయన అభినందించారు. అలాగే శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కారు ప్రజల మనోభావాలకు విలువనిచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చక్రపాణి మహరాజ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.హిందూ సంస్కృతికి పట్టుగొమ్మ లాంటి అమరావతినే రాష్ట్ర రాజధానిగా ఉంచాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

English summary
Chakrapani Maharaj, chairman of Hindu Maha Sabha, warns the YCP government. He said the decision of the three capitals of CM Jagan was not good. He revealed that they are expressing solidarity with the capital farmers. The chairman of the Hindu Maha Sabha has announced that they are opposed to the move of Amaravati which is a catalyst for Hindu culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X