ప్రధానితో చంద్రబాబు దంపతుల భేటీ - కీలక మలుపు..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయంగానూ లెక్కలు మారుతున్నాయి. అమరావతి - పోల వరం ప్రాజెక్టులకు కేంద్రం మద్దతుగా నిలుస్తోంది. అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీ మే 2న ఏపీకి రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి తో కలిసి ప్రధాని మోదీని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధానితో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శుక్రవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానితో భేటీ అవుతున్నారు. ఈ సారి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో సహా ప్రధానితో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారింది. అమరావతి పనుల రీ లాంఛ్ కోసం మే 2న మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ప్రధాని పర్య టన ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో.. ప్రధాని మోదీని సతీ సమేతంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందు కోసం రేపు (25వ తేదీ)న ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దాదాపు లక్ష కోట్ల విలువైన పనుల కు ప్రధాని శంకుస్థాపన చేసేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రేపు సాయంత్రం 4.30 గంట లకు ప్రధానితో అప్పాయింట్ మెంట్ ఖరారైంది.

chandra-babu-couple-to-invite-pm-modi-for-amaravati

అమరావతి కి ప్రధాని
మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన వేళ.. రోడ్ షో తో పాటుగా భారీ బహిరంగ సభకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ప్రధాని పర్యటన వేళ ఏర్పాట్లను మంత్రి నారాయణ క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ప్రధాని చేతుల మీదగా లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు హాజరవుతారన్నారు. నేషనల్ హైవేకు కనెక్ట్ చేసే రోడ్లు గుర్తింపు, 11 పార్కింగ్ ప్లేస్​లు గుర్తించామన్నారు. 8 రోడ్లు ద్వారా బహిరంగ సభ వేదికకు చేరుకోవచ్చని తెలిపారు. భద్రతాపరంగానూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని అమరావతికి చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు.

రోడ్ షో - భారీ సభ
సభాప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తామని, ఒక వేదిక మీద 30 మంది రాజధాని రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు ఉంటారని అన్నారు. హెలిప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు 1.1 కిలో మీటర్ల మేర ప్రధాని రోడ్‌ షో ఉంటుందని తెలిపారు. అమరావతిని నేషనల్ హైవేకి అనుసంధానం చేసే E-13, E-15, E-11, సీడ్‌ యాక్సిస్‌ రహదారి పనులు పూర్తిస్థాయిలో కానందున ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ఇతర రహదారులను పరిశీలించారు. మే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పీఎం మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభాప్రాంగణం వద్దకు వస్తారని మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+