మంత్రి ప‌ద‌వులు..ఎమ్మెల్సీలు : జ‌గ‌న్..బాబు హామీల వ‌ర్షం : అమ‌లయ్యేనా..!

ఎన్నిక‌ల వేళ అసంతృప్తుల‌ను బుజ్జ‌గించేందుకు టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్సీ హామీలు ఇచ్చేస్తున్నారు. ఇక , మీ అభ్య‌ర్దుల‌ను గెలిపిస్తే వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. అయితే, ఎన్నిక‌ల వేళ ఈ ఇద్ద‌రూ ఇస్తున్న హామీలు ఆశావాహుల్లో ఉత్కంఠ‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు..ఎవ‌రు ఈ హామీల‌ను అమ‌లు చేస్తారంటూ..అసంతృప్తితోనే పార్టీ అధినేత‌ల వైపు ఆశ‌గా చూస్తున్నారు..

Chandra Babu..Jagan Assrances is in high : ministrys and mlc offers

చంద్ర‌బాబు ఎమ్మెల్సీ హామీలు..
ఎన్నిక‌ల్లో అనేక మంది ఆశావాహులు టిడిపి టిక్కెట్లు ఆశించారు. వారంద‌రికీ టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్సీ హామీలు ఇచ్చేసారు. క‌డ‌ప జిల్లాలో టిక్కెట్లు ఆశించి..భంగ‌ప‌డి పార్టీకి స‌హ‌క‌రించ‌మ‌ని చెప్పటంతో చంద్ర‌బాబు పార్టీ నేత‌లైన వీర శివారెడ్డి, వ‌ర‌ద రాజుల రెడ్డికి ఎమ్మెల్సీలు ఇస్తామ‌ని క‌డప ప్ర‌చారంలో ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే వ‌ర్ల రామ య్య‌, జూపూడి ప్ర‌భాక‌ర్ వంటి వారు ఎమ్మెల్సీ సీట్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో అనేక మంది ఎమ్మె ల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారిలో సోమిరెడ్డి, రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసారు. వీరిద్ద‌రూ ఎన్నిక‌ల్లో గెలిస్తే స‌రి..లేకుంటే వారికి తిరిగి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇస్తారా లేదా స్ప‌ష్ట‌త లేదు. ఇక‌, వంగ‌వీటి రాధాకు ఎమ్మెల్సీ ప‌ద‌వి పెండింగ్ లో ఉంది. ఇక‌, నారాయ‌ణ ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం ముగిసింది. ఆయ‌న ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్నారు. ప‌య్య‌వుల కేశ‌వ్, అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్‌, లోకేశ్‌, డొక్కా మాణిక్య వ‌ర ప్ర‌సాద్ వంటి వారు త‌మ ప‌ద వుల‌కు రాజీనామా చేయ‌కుండానే ఎమ్మెల్యేలు గా పోటీ చేస్తున్నారు. ఫలితాల‌ను బ‌ట్టి వీరి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంది. ఇక చీరాల లో వైసిపి నుండి చేరిన బాలాజీకి చంద్ర‌బాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

జ‌గ‌న్ మంత్రులు చేస్తామంటూ..
వైసిపి అధినేత జ‌గ‌న్ ఈ సారి ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తామ‌నే అంచ‌నాతో ఉన్నారు. స‌ర్వేలు సైతం అనుకూలం గా ఉండ‌టంతో మ‌రింత ఆశ‌లు పెరుగుతున్నాయి. అయితే, జ‌గ‌న్ ఇప్ప‌టికే కొందిరికి మంత్రి ప‌ద‌వుల పై హామీలు ఇ చ్చారు. కుప్పంలో చంద్ర‌బాబు పై పోటీ చేస్తున్న చంద్ర‌మౌళిని గెలిపిస్తే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట లో సీటు ఇవ్వ‌లేక పోయిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు సైతం మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇక‌, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో మండ‌పేట నుండి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా విజ‌య‌వాడ నుండి ముస్లిం మైనా ర్టీ నేత‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా టిక్కెట్లు ద‌క్క‌ని ప‌లువురు సీనియ‌ర్ల‌కు సైతం ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండు పార్టీల్లో హామీలు పొందిన నేత‌లు త‌మ భ‌విష్య‌త్ ఏంట‌నే ఆందోళ‌న చెందుతూనే ఎన్నిక‌ల ఫ‌లితాల వైపు ఆశ‌గా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+