అమెరికాకు చంద్రబాబు - అసలు కారణం..!!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. లోలోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారనేది పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు.అయిదు రోజులు తరువాత తిరిగి రానున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల అంచనాల పైన టీడీపీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. లోకేశ్ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు. చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు.

ఏపీలో ఎన్నికలు పూర్తయిన తరువాత టీడీపీ కూటమి నేతలు గెలుపు పైన భారీ అంచనాలతో ఉన్నారు. అయితే, అధికారికంగా టీడీపీ ముఖ్య నేతలు తాము గెలిచే సీట్ల సంఖ్య...గెలుపు గురించి ఎక్కడా స్పందించలేదు. జగన్ ఐ ప్యాక్ టీంతో సమావేశమైన సమయంలో 2019 లో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పారు.
జగన్ వ్యాఖ్యలు పూర్తి నమ్మకంతో చెప్పారా..పార్టీ కేడర్ లో విశ్వాసం పెంచేందుకు చెప్పారా అనే చర్చ నడుస్తోంది. టీడీపీ అధినాయకత్వం జగన్ వ్యాఖ్యల పైన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో..ఎన్నికల ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. రెండు పార్టీల నుంచి గెలుపు పైన విశ్వాసం ఉన్నా..అసలు విజేత ఎవరనేది జూన్ 4న తేలనుంది.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications