క్వాష్ పిటీషన్ హైకోర్టు కొట్టివేతతో చంద్రబాబు కీలక నిర్ణయం..!!

తెలుగు దేశం అధినేత చంద్రబాబు(Chnara Babu) కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ కేసులో హైకోర్టు(High Court) క్వాష్ పిటీషన్ కొట్టివేతపై న్యాయ పోరాటం కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా క్వాష్ పిటీషన్ ను హైకోర్టు తీర్పును సుప్రీం(Supreme court)లో సవాల్ చేస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సీఐడీ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

సుప్రీంకు చంద్రబాబు : సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలు(Rjahmundry Jail)లో రిమాండ్ లో ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రెండు రోజులు రిమాండ్ పొడిగించింది. ఇదే సమయంలో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్..దాని ఆధారంగా ఏసీబీ కోర్టు(ACB Court) తనకు జ్యుడిషయల్ రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు.

Chandra Babu moves for Supreme court against High Court Dismissal sqash petition in Skill development Case

గత వారం ఈ పిటీషన్ పైన చంద్రబాబు..సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ తరువాత రిజర్వ్ చేసిన తీర్పును న్యాయస్థానం శుక్రవారం వెల్లడించింది .చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్(Squash Petition) ను డిస్మిస్ చేస్తూ తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.

హైకోర్టు తీర్పు సవాల్ : సీఆర్పీసీ సెక్షన 482 ప్రకారం ప్రస్తుత కేసులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం(High Court) పేర్కొంది. కేసుకు చెందిన వాస్తవాల విషయంలో ఇరు వైపుల సీనియర్ న్యాయవాదులు లేవెనెత్తిన అంశాలపై 482 కింద హైకోర్టు మినీ ట్రైల్ నిర్వహించటానికి వీల్లేదని పేర్కొంది. ఈ కేసు 2021 డిసెంబర్ 9న నమోదైందని, దర్యాప్తు సంస్థ 140 మందికి పైగా సాక్షులను విచారించి, 4 వేలకు పైబడి దరఖాస్తును సేకరించిందని గుర్తు చేసారు. దర్యాప్తు తుది దశలో ఉన్న ఈ సమయంలో ఎఫ్ఐఆర్ లోనూ, జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తూ ఏసీబీ కోర్టు(ACB Court) ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ..క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది.

Chandra Babu moves for Supreme court against High Court Dismissal sqash petition in Skill development Case

విచారణపై ఉత్కంఠ : చంద్రబాబు (Chandra Babu)తరపు న్యాయవాదులు గట్టిగా ప్రస్తావించిన సెక్షన్ 17ఏ పైనా హైకోర్టు తీర్పులో క్లారిటీ ఇచ్చింది. దీంతో, ఇప్పుడు హైకోర్టు(High Court) తీర్పు పైన చంద్రబాబు తరపు న్యాయవాది సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. ఇదే సమయంలో సీఐడీ కూడా కేవియట్ దాఖలుకు సిద్దమైనట్లు చెబుతున్నారు.

ఈ పిటీషన్ పైన న్యాయస్థానం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు ఏసీబీ కోర్టు(ACB Court)లో చంద్రబాబు రిమాండ్..బెయిల్ (Bail)అంశం పైన సోమవారం విచారణ జరగనుంది. ఇదే సమయంలో సుప్రీంలో క్వాష్ అప్పీల్ విచారణకు వస్తే న్యాయస్థానాల్లో చంద్రబాబు కేసుల వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+