ధర్మం ప్రకారమే రామోజీ పని చేసారు - చంద్రబాబు..!!
రామోజీ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు జాతి కోసం అహర్నిశలు పని చేసారని కొనియాడారు. రామోజీ రావు ప్రజలను చైతన్య పరిచారని చెప్పుకొచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసిన తరువాత చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సతీమణి భువనేశ్వరితో కలిసి రామోజీకి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యలను పరామర్శించారు.
రామోజీరావును యుగపురుషుడుగా చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన మరణ వార్త జీర్ణించుకోలేక పోతున్నామని చెప్పారు. సమాజ హితం , తెలుగు జాతి కోసం పని చేసారని కొనియాడారు. సాధారణ వ్యక్తిగా పుట్టి అసాధరణ వ్యక్తిగా మారారని కీర్తించారు. రామోజీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థగా అభివర్ణించారు. ఈనాడు ప్రారంభించి..ప్రజలను చైతన్యవంతులను చేసారన్నారు. రామోజీ ఏ పని చేసినా రాజీ లేదన్నారు.
40 ఏళ్లుగా ధర్మం ప్రకారమే పని చేస్తానన్నారని..తాను ఏం చెప్పినా ఇదే సమాధానం చెప్పేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

రామోజీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని స్పస్టం చేసారని వివరించారు. ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలు శాశ్వతమని చెప్పుకొచ్చారు. రామోజీ స్పూర్తి చిరకాలం నిలిచిపోతుందన్నారు. తెలుగు జాతి భవిష్యత్ కోస ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నిలిచిపోతాయని చంద్రబాబు వివరించారు. పని చేస్తూనే చనిపోవాలని రామోజీ కోరుకున్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఫిలిం సిటీ స్థాపించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేసారని కొనియాడారు. రామోజీ రావు ఇచ్చిన స్పూర్తితో ఏపీ లో డెవలప్ మెంట్ కోసం పని చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు












Click it and Unblock the Notifications