ఇదే లాస్ట్, వదలిపెట్టను - చంద్రబాబు హెచ్చరిక..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. లైన్ తప్పితే కఠిన చర్యలు తప్పవని పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసారు. ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. ఇసుక వివాదాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసారు. వైసీపీ చేసిన తప్పులే వారిని 11 సీట్లకు పరిమితం చేసాయని వివరించారు. వారు చేసిన తప్పులే మనం చేయకూడదని నిర్దేశించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసారు.

మద్యం వ్యాపారం వద్దు
మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులే వారిని అధికారానికి దూరం చేసాయని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాకం వలనే బడుమేరు పొంగి విజయవాడకు వరదలు వచ్చాయని చెప్పారు. వరద బాధితులకు సాయం కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. ప్రత్యర్ది పార్టీల వద్ద సంచుల కొద్దీ డబ్బులు ఉన్నాయన్నారు. డబ్బులు ఉన్నా వారు గెలవలేకపోయారని వ్యాఖ్యానించారు.

Chandra Babu warns party MLA s over involvement in liquor and Sand issues

ఎవర్ని వదిలిపెట్టను
2029లోనూ గెలుపు కోసం మిత్రపక్షాలతో సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సారి ఏపీలో కరువుకు ఆస్కారం లేదన్నారు. కేంద్రం, ఏపీలో చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరంకు కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. కార్యకర్తలు కసితో ఉన్నారని..వారి కష్టంతోనే అధికారంలోకి వచ్చామని వివరించారు. ఎన్డీఏతో పొత్తులో ఉన్నా పదవులు డిమాండ్ చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు.

పొత్తులు కొనసాగాలి
మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సమీక్షించాలని సూచించారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలనొ.. ఎవరు అతిక్రమించ వ్యవహరించవద్దని తేల్చి చెప్పారు. త్వరలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేసారు. మూడు పార్టీల మైత్రి భవిష్యత్ లోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+