Chandrababu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు-ఫుల్ షెడ్యూల్, అజెండా ఇదే..!

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ పయనమయ్యారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రకటించిన నిధుల విడుదల కోసం ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో చర్చలు జరిపేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇందులో పోలవరం, అమరావతి రాజధాని ప్రాజెక్టులతో పాటు వెనుక బడిన జిల్లాలకు నిధులు ఉన్నాయి. వీటిపై బడ్డెట్ లో ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారిని చంద్రబాబు కోరబోతున్నారు.

ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. 7 గంటలకు జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయి పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ తో చంద్రబాబు భేటీ కానున్నారు.ఇందులో మొత్తం బడ్జెట్ హామీలపై చర్చిస్తారు. అనంతరం రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. తర్వాత సాయంత్రం 7 గంటలకు అమిత్ షా తో భేటీ కానున్న చంద్రబాబు ... రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై చర్చిస్తారు.

Chandrababu arrived to delhi to meet pm modi union ministers on state issues

అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా రూ.15వేల కోట్లను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. వీటిపై చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీమ్ కూడా అమరావతి వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించనున్నారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రుణాల రీషెడ్యూల్ కు కూడా ప్రధాని మోదీని చంద్రబాబు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇటీవల నిర్మలా సీతారామన్ ను ఏపీ ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలిసి పలు అంశాలపై చర్చించారు. వాటి పురోగతిపై చంద్రబాబు మరోసారి చర్చించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+