వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్తీ నాటుసారా, జె బ్రాండ్స్ మద్యంపై పోరాటం.. రేపు, ఎల్లుండి నిరసనలకు చంద్రబాబు పిలుపు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ నాటుసారా తాగి జంగారెడ్డిగూడెంలో సామాన్య ప్రజలు మరణించారని ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో మద్యం బ్రాండ్స్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో కల్తీ సారాను అరికట్టాలని, జె బ్రాండ్స్ మద్యం నిషేధించాలన్న డిమాండ్ తో రేపు, ఎల్లుండి నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వీఓఏ ఆత్మహత్య; వైసీపీ నాయకుడి వేధింపులు; పోలీసులు స్పందించకపోవడం దారుణం: చంద్రబాబువీఓఏ ఆత్మహత్య; వైసీపీ నాయకుడి వేధింపులు; పోలీసులు స్పందించకపోవడం దారుణం: చంద్రబాబు

 గ్రామ స్థాయిలో జే బ్రాండ్ మద్యంపై నిరసనలకు చంద్రబాబు పిలుపు

గ్రామ స్థాయిలో జే బ్రాండ్ మద్యంపై నిరసనలకు చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ మద్యపాన నిషేధాన్ని చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జై బ్రాండ్ మద్యం అమ్మకాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. మద్యంపై ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నేతలు, కేడర్ నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో జే బ్రాండ్ మద్యంపై పోరాటం సాగించాలని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ ధనదాహంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

దేశంలో లేని బ్రాండ్లు ఏపీలోనే ఎందుకు ఉన్నాయి? చంద్రబాబు మండిపాటు

దేశంలో లేని బ్రాండ్లు ఏపీలోనే ఎందుకు ఉన్నాయి? చంద్రబాబు మండిపాటు


దేశంలో లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన చంద్రబాబు కొత్త బ్రాండ్ లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ లపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కమీషన్ల రూపంలో ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి 25 వేల నుండి 30 వేల కోట్లు కాజేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. కేవలం ధనార్జన కోసమే జగన్ బ్రాండ్ మద్యం ఏపీలో విక్రయిస్తున్నారని మండిపడ్డారు.

 సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబులనుంచి 5 వేల కోట్లు

సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబులనుంచి 5 వేల కోట్లు


సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబులలో నుంచి 5 వేల కోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది అసత్యాల ప్రయాణమని ఇప్పుడిప్పుడే అన్ని బయట పడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం, ఆదివారం జే బ్రాండ్ మద్యం పై సమర శంఖం పూరించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మంది డీఎస్పీలు గా ప్రమోషన్ అనేది జగన్ చేసిన తప్పుడు ప్రచారం అని తేలిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత టీడీపీ పాలనపై బురద చల్లాలని జగన్ చేసే ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయని చంద్రబాబు పేర్కొ

English summary
Chandrababu called the party ranks to protest against ap liquor brands tomorrow and day after tomorrow. Chandrababu demanded to ban J brands
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X