'పుష్ప' సినిమాలో చంద్రబాబు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమాలో తన ఫొటోను పెట్టారని వైసీపీవాళ్లు ఏడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విలేకర్లతో జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఓ విలేకరి... పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా పుష్పకు జాతీయ అవార్డును ప్రకటించినప్పుడు అధికార పార్టీలోని నిజమైన స్మగ్లర్లకు ఏ అవార్డు ఇవ్వాలి అని ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ పుష్ప సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ లో తన ఫొటో ఉంటుందని, ఆ సినిమా చూపించిన కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నాననో.. లేదంటే ఎర్ర చందనం స్మగ్లర్లను తాను కంట్రోల్ చేశాననో వాళ్లు తన ఫొటో పెట్టి ఉండొచ్చన్నారు. దానికే వైసీపీవాళ్లు ఏడుస్తున్నారన్నారు.

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు అవార్డు రావడంపై చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ కు శుభాకాంక్షలని, అలాగే వివిధ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్నవారికి కూడా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తన విషెస్ తెలిపారు. పుష్ప సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ అల్లు అర్జున్ పోలీసులకు దొరికిపోయిన సందర్భంలో అక్కడి పోలీస్ స్టేషన్ లో గోడకు చంద్రబాబు ఫొటో ఉంటుంది. అలాగే సినిమాలోని మరో సన్నివేశంలో కూడా ఆయన ఫొటో కనిపిస్తుంది.
పుష్ప చిత్రంలో కనపరిచిన నటనకు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా, సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీస్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.












Click it and Unblock the Notifications