ఆత్మవిశ్వాసం పెంచేందుకు సైకిళ్లు
అమరావతి: విజ్ఞానాన్ని వినియోగించుకుని ఫలితాలను రాబట్టగలిగితేనే సమాజంలో సంపద సృష్టి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విద్యాశాఖపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరినీ చదివించి ప్రయోజకులను చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసం పెంచేందుకే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. ప్రాథమిక విద్య, ఉన్నతవిద్య, సాంకేతిక విద్య అనుసంధానం జరగాలని, మెడికల్, పారామెడికల్, ఫార్మసీ విద్యార్ధులతో మల్టీ స్టూడెంట్ డిసిప్లిన్ టీమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామీణుల ఆరోగ్యంపై వైద్యవిద్యార్ధులు పంటసంజీవని, జల సంరక్షణపై ఇంజనీరింగ్ విద్యార్ధులు క్షేత్రస్థాయిలో పరిశోధనలు, అధ్యయనం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications