అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chandrababu : కియాకు చంద్రబాబు కంగ్రాట్స్-కారెన్స్ కు కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుపై ట్వీట్..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా తన ప్రతిష్టాత్మక మోడల్ కారెన్స్ కారుకు ఈ ఏడాది "ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్" అవార్డు సాధించింది. దీంతో కియాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దలు కూడా అభినందిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కియా సాధించిన అవార్డుపై స్పందిస్తూ ట్వీట్ పెట్టారు. ఇందులో ఇది ఏపీకి గర్వకారణమంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది అత్యుత్తమ కార్ గా కియా కారెన్స్ ఎంపిక కావడంపై Kia కార్ల కంపెనీకి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం ప్లాంట్ లో తయారైన కియా కారెన్స్ మోడల్ కార్ కు Indian car of the year 2023 అవార్డ్ రావడం పై అభినందనలు తెలిపారు.

Chandrababu congrats KIA for achieving Indian car of the year 2023 award to carens

ఈ మేరకు ఆయన ట్వీట్లో తన సంతోషాన్ని పంచుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీలో కియా కార్ల కంపెనీ అడుగుపెట్టింది. అప్పట్లో కియా సంస్ధకు కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఈ సంస్ధ రాకకు తోడ్పడ్డారు.

Chandrababu congrats KIA for achieving Indian car of the year 2023 award to carens

గత ప్రభుత్వ హయాంలోనే ఏపీలో అడుగుపెట్టిన కియా కార్ల కంపెనీ తాజాగా గత రెండేళ్లలో తమ ప్లాంట్ విస్తరణతో పాటు కొత్త మోడళ్ల తయారీ కూడా చేపట్టింది. ఇందులోనే కారెన్స్ మోడల్ కూడా బయటికి వచ్చింది. కారెన్స్ కారు తన అత్యుత్తమ పనితీరుతో ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా సాధించింది. దీంతో కియా సంస్ధపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కారెన్స్ కారుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధించడం ద్వారా కియా వంటి మరిన్ని సంస్ధలు ఏపీలో అడుగుపెట్టేందుకు అవకాశం లభించింది.

English summary
tdp chief chandrababu on today congratulates KIA cars company for achieving indian car of the year 2023 award to its variant carens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X