జగన్ కు చంద్రబాబు తాజా సవాల్- రా తేల్చేసుకుందాం..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల పేరుతో వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. వీటిపై ఇవాళ్టి వరకూ వేచి చూసిన జగన్.. ఇవాళ మాత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాటి డొల్లతనాన్ని బయటపెట్టారు. గతంలో టీడీపీ పాలనలో ఏం జరిగింది, ఆ తర్వాత తన పాలనలో ఏం జరిగిందన్న అంశాల్ని పోలుస్తూ పలు వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ఢిల్లీ వెళ్లి నిరసనలు చేసిన వైఎస్ జగన్.. అనంతరం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విపక్ష నేత హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని, తాను ప్రశ్నిస్తానన్న భయమే ఇందుకు కారణమని జగన్ ఇవాళ విమర్శించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్ కు సవాల్ విసిరారు. అలాగే జగన్ చేస్తున్న విమర్శలకు జవాబిచ్చారు.

Chandrababu dares ys jagan to come to assembly to discuss everything

జగన్ ఇవాళ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన పలు విషయాలపై చంద్రబాబు స్పందించారు. వినుకొండ ఘటనలో చంపుకున్నది ఇద్దరు వైసీపీ వారేనన్నారు. 36 మందిని చంపారంటున్న జగన్.. వాళ్ల పేర్లు చెప్పాలన్నారు. అందులో నిజముంటే చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే అప్పుల గురించీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 2.75 లక్షల కోట్లు బటన్ నొక్కి వేశామని చెప్పుకున్న జగన్.. మిగతా డబ్బు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మీ అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పే స్థాయి నాది కాదు, కానీ నిజాన్ని చెప్పాల్సి వచ్చిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+