Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ ఉల్లికి కష్టాలు- రైతుల గగ్గోలు- చంద్రబాబు కీలక ఆదేశాలు..!

ఏపీలో భారీ వర్షాలు ఉల్లి పంటకు శాపంగా మారుతున్నాయి. ఓవైపు డిమాండ్ కు తగినంతగా ఉల్లిపాయలు లేకుండా పోతుంటే.. మరోవైపు ఉల్లికి కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు రోడ్డెక్కే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. కనీస మద్దతు ధర కోరుతూ ఇవాళ ఉల్లి రైతులు కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఆందోళన తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు కూడా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అలాగే ఏపీకి ప్రధానంగా ఉల్లి సరఫరా జరిగే మహారాష్ట్ర సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి రావాల్సిన ఉల్లిపాయలు రావడం లేదు. అదే సమయంలో రైతులకు తగిన మద్దతు ధర కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలు మార్కెట్‌ యార్డును సందర్శించిన వైసీపీ నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు.

Chandrababu Directs Officials as Onion Prices Rise Farmers Hit by Poor MSP

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. తమక కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఉల్లికి సరైన గిట్టుబాట ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని క్వింటాకు రూ. 200 నుండి రూ. 400 వరకూ మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆందోళనకు దిగారు. తమ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి మద్దతు ధర లేక అప్పులు పాలు అవుతున్నామని రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర రూ. 2 వేలు కల్పించాలని కోరుతున్నారు.

ప్రతి ఏడాది క్వింటాలు రూ. 3000 నుంచి రూ.5000 వరకు ధర వచ్చేవని, సరుకు పూర్తిగా పాడైనా కనీసం క్వింటాలుకు రూ. 1800 నుంచి రూ. 2000 పలికాయని వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ఏడాది మాత్రం క్వింటాలు రూ.100 కు కూడా అడిగే పరిస్ధితులు లేవని రైతులు లబోదిబోమంటున్నారన్నారు. దీనిపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ఉల్లి క్వింటాల్‌ రూ.1,200లకు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Chandrababu Directs Officials as Onion Prices Rise Farmers Hit by Poor MSP

ఉల్లి పంటను కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. 5వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఉల్లిని రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్‌ హౌసింగ్‌ సదుపాయం కల్పించాలన్నారు. ఉల్లి రైతులకు నష్టం రాకుండా అధికారులు చూడాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+