ఎంపి రవీంద్రబాబుకు నోటీసు: ఆర్మీపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం(వీడియో)
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన అమలాపురం పార్లమెంటుసభ్యుడు రవీంద్రబాబుకు సంజాయిషీ నోటు ఇవ్వాలని తెలుగుదేశం అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు పార్టీని ఆదేశించారు. భారత సైనికులపై రవీంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ సైనికులు ఆందోళనకు దిగడంతో, ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అంతేగాక, బాధ్యత లేకుండా సైన్యంపై వ్యాఖ్యలు చేసినందుకు రవీంద్రబాబుపై టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైనికులంటే టిడిపికి ఎంతో గౌరవం ఉందని తెలిపారు.
మద్యం, మాంసం, ఉచిత ప్రయాణం కోసమే యువత సైన్యంలో చేరుతున్నారని రవీంద్రబాబు ఓ జాతీయ మీడియా నిర్వహించిన డిబేట్‌లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
కాగా, తన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పుంటే, క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని ఎంపి రవీంద్రబాబు తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications