గుంటూరు, బెజవాడ ఇంటి ఓనర్లకు బాబు హెచ్చరిక, వేదికపై లోకేష్ అసంతృప్తి
విజయవాడ: విజయవాడ, గుంటూరులలో పెరుగుతున్న అద్దెల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన అద్దెలు పెంచితే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రయోగిస్తామని ఇంటి యజమానులను చంద్రబాబు హెచ్చరించారు.
గురువారం నాడు పలువురు ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు గుంటూరు, విజయవాడలలో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వారి నుంచి అద్దెల విషయమై చంద్రబాబు ఆరా తీశారు. ఇష్టారీతిన పెంచితే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు.

మహానాడు వేదిక నిర్మాణంపై లోకేష్ అసహనం
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని మహానాడు ఏర్పాట్లకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎటు చూసినా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలతో తిరుపతి పసుపుమయంగా మారింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏర్పాట్ల పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకేష్ వేదిక వద్దే కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.
కొనుగోలు సృష్టికర్త వైయస్సార్
ఎమ్మెల్యేల కొనుగోలు సృష్టికర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైసిపి అధినేత జగన్ ఆర్థిక ఉగ్రవాదానికి ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారన్నారు. జగన్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని చెప్పారు. చంద్రబాబు, జగన్ ఇళ్లు పరిశీలిస్తే ఎవరు ఏమిటో తెలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications