వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు నో పోలీస్!: విచారణ తప్పదు: బుద్ధా వెంకన్న అరెస్టుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అరెస్టుపై ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని అన్నారు. బుద్ధా వెంకన్నపై కుట్రపూరితంగా కేసు బనాయించారని, అతడ్ని వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు ఫైర్

నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు ఫైర్

మంత్రి కొడాలి నాని క్యాసినోపై ప్రశ్నించిన తమ నేతలను అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదని, దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన పోలీసులు విచారణ ఎదుర్కొనక తప్పదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

అప్పుడు నో పోలీస్ అంటూ నారా లోకేష్ నిప్పులు

అప్పుడు నో పోలీస్ అంటూ నారా లోకేష్ నిప్పులు

మరోవైపు, టీడీపీ నేత నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు, ప్రజా రక్షణ కోసమే పనిచేస్తున్నారా? లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాపలా కాస్తున్నారా? అని ప్రశ్నించారు. బుద్ధా వెంకన్న అరెస్టును ఆయన ఖండించారు. కొడాలి నాని క్యాసినో నడిపినప్పుడు, గడ్డం గ్యాంగ్ అని ప్రతిపక్ష నేతని బూతులు తిట్టినప్పుడు పోలీసులు ఎక్కడున్నారని నిలదీశారు. గతంలో చంద్రబబు నాయుడు ఇంటిపై దాడి చేసినప్పుడు పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు నారా లోకేష్. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్ అంటూ ధ్వజమెత్తారు. క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ.. ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారని నారా లోకేష్ ప్రశ్నించారు.

కొడాలి నాని, డీజీపీపై బుద్ధా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్, ఉద్రిక్తత

కొడాలి నాని, డీజీపీపై బుద్ధా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్, ఉద్రిక్తత


కాగా, గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలినాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు బుద్ధా వెంకన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు బుద్ధా వెంకన్న సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యలో క్యాసినో నిర్వహించారని, అందులో డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వాటా ఉందని, అందుకే కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అంతేగాక, చంద్రబాబు ఇంటిగేటు తాకితే కొడాలి నాని శవాన్ని ఇంటికి పంపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు ఉదయమే బుద్ధా ఇంటికి వెళ్లారు పోలీసులు. కాగా, అరెస్ట్ సమయంలోనూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు బుద్ధా వెంకన్న. తాను మాట్లాడిన మాటలు పచ్చి నిజాలంటూ.. డీజీపీ జగన్ కు తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలియగానే పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా ఇంటికి చేరుకున్నారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
Chandrababu fires at YSRCP govt and police for arresting Buddha Venkanna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X