ఏపీలో పనిచేస్తున్న తెలంగాణా ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త!
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఏపీ సర్కార్ ఏపీలో పని చేస్తున్న తెలంగాణా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారిని రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణా స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణా స్థానికత కలిగిన వారిని ఏపీకి కేటాయించారు. అయితే అప్పటి నుండి తమను తెలంగాణాకు తిరిగి పంపాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

తెలంగాణా సీఎం అభ్యర్ధనతో చంద్రబాబు నిర్ణయం
తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇరు రాష్ట్రాల సీఎం లకు ఉద్యోగుల వినతి
రెండు తెలుగు రాష్ట్రాల విభజన పూర్తి అయ్యి పదేళ్లు గడుస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు అభ్యర్థనలు పంపారు.
ఇండిపెండెన్స్ డే ముందు ఉద్యోగులు రిలీవ్
ఇటీవల తెలంగాణ ప్రాంతానికి తమను తిరిగి పంపాలని ఉద్యోగుల విజ్ఞప్తుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబును తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేయాలని కోరారు. దీంతో సీఎం చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలోని తెలంగాణా ఉద్యోగులను పంపుతున్న ఏపీ
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 712 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఉన్నారని సమాచారం. సచివాలయంతో పాటు వివిధ హెచ్వోడీల కార్యాలయాలు, 9 10 షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులు తమను రిలీవ్ చేయాలని కోరారు. ఈ క్రమంలోని తాజాగా సీఎం చంద్రబాబు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని నిర్ణయించే వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications