చంద్రబాబు సొంత జిల్లాలో 27 మంది ఎంపీడీలు ఔట్, కడప జిల్లాకు ఎంత మంది అంటే ?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు జిల్లాల్లోని గ్రేడ్ వన్, గ్రేటు 2 ఉద్యోగుల్ని పలు జిల్లాలకు బదిలీ చేశారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వో లు, తహసిల్దార్ లతో పాటు అనేకమంది ఉద్యోగుల్ని ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు బదిలీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆ అధికారులు ఆయా జిల్లాల్లోనే విధులు నిర్వహించారు.

అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని అనేక ఆరోపణలు రావడంతో ఎన్నికల కమిషన్ చాలామంది అధికారులను ఒక జిల్లా నుండి ఒక జిల్లాకి బదిలీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడం, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని అనేకమంది సీనియర్ ఉద్యోగులు ప్రభుత్వానికి మనవి చేశారు. అయితే చాలా జిల్లాల్లో అధికారులు ఇంకా బదిలీ కాలేదు.

Chandrababu government has transferred 27 MPDOs in joint Chittoor district

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ అధికారులకి బదిలీ చేయడానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిత్తూరు జిల్లాకి 27 మంది ఎంపీడీవోలు బదిలీపై వచ్చారు. అయితే ఆ ఎంపీడీవోలు బదిలీలకు ఇంతవరకు బ్రేక్ పడుతూ వచ్చింది. ఎట్టకేలకు చిత్తూరు జిల్లాలో ఉన్న 27 మంది ఎంపీడీవోలు వారి సొంత జిల్లాలకు బదిలీ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 27 మందికి స్థానచలనం కల్పించారు. నెల్లూరు జిల్లాకు చెందిన 16 మంది ఎంపీడీవోలు, కడప జిల్లాకు చెందిన 11 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 27 మంది ఎంపీడీవోలు వారు విధులు నిర్వహిస్తున్న కార్యాలయాల్లో రిలీవ్ కావాలని, తరువాత వారివారి సొంత జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో హాజరై రిపోర్టు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Chandrababu government has transferred 27 MPDOs in joint Chittoor district

తరువాత వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి బాధ్యతలు స్వీకరించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆ ఎంపీడీవోలకు ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నారు అనే విషయం తెలియడం లేదని సమాచారం. ఎంపీడీవోలు ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెలితే కాని వాళ్లకు ఎక్కడ పోస్టింగ్ లు ఇచ్చారు అనే విషయం తెలియదని సంబంధిత అధికారులు అంటున్నారు.అయితే కొంతమంది ఎంపీడీవోలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని తెలిసింది...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+