Dwacra: డ్వాక్రా మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్-ఆ రోజేే రెండు పథకాలు..!
ఏపీలో డ్వాక్రా (DWACRA)మహిళలకు సీఎం చంద్రబాబు (chandrababu) మరో శుభవార్త చెప్పారు. స్వయం ఉపాధి గ్రూపులు నిర్వహిస్తున్న మహిళలకు మరింత అండగా నిలిచేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం తరఫున మరో రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ప్రారంభానికి ముహుర్తం కూడా ఖరారు చేశారు. దీంతో ఈ రెండు పథకాల కోసం ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళలు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల కోసం ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పేరుతో రెండు పథకాలు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. వీటిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం 10 వేల నుంచి లక్ష రూపాయల వరకూ రుణంగా ఇవ్వనుంది. దీనిని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించేందుకు వారికి అవకాశం కల్పిస్తారు. అలాగే విద్యాలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు సాయం అందించనున్నారు.

విద్యాలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళల పిల్లలకు 10 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ రుణంగా అందజేస్తారు. వీటిని కూడా నిర్ణీత కాల వ్యవధిలో తిరిగి చెల్లించాల్లి ఉంటుంది. అయితే డ్వాక్రా గ్రూపుల్లో కనీసం ఆరు నెలలు సభ్యత్వం కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ రుణాలు లభిస్తాయి. వీటికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అలాగే మిగతా నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది. ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న మహిళలు పిల్లల చదువులు, పెళ్లిళ్ల విషయంలో పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.












Click it and Unblock the Notifications