వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిన్నరగా: బాబుకు 'నో' వెనుక మరో కోణం ఉందా, అది మోడీకే నష్టం?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు అపాయింటుమెంట్ ఇవ్వలేదనే విషయం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు అపాయింటుమెంట్ ఇవ్వలేదనే విషయం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

చదవండి: జగన్-పవన్‌లకు భిన్నంగా..: బిజెపిని కార్నర్ చేసేందుకు బాబు సరికొత్త వ్యూహం


ఏపీకి కేంద్రం ఇచ్చే నిధుల గురించి చంద్రబాబు అడుగుతారనే ఉద్దేశ్యంతోనే ఆయనకు బిజెపి అగ్రనేతలు అపాయింటుమెంట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదనే చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే రాజకీయకోణం కూడా లేకపోలేదంటున్నారు.

చదవండి: ఇంత దారుణమా?: ఆశ్చర్యపోయిన జగన్, అసంతృప్తి, సీనియర్లకు క్లాస్

మోడీ-చంద్రబాబులు కలవక చాలా రోజులు

మోడీ-చంద్రబాబులు కలవక చాలా రోజులు

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల భేటీ జరగక చాలా రోజులు అవుతోంది. ఇటీవల జూలైలో గుజరాత్‌లో జరిగిన టెక్స్‌టైల్ ఇండియా 2017లో మోడీని కలిశారు. కానీ మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు. ఇరువురు భేటీ దాటి ఏడాదిన్నర అవుతోంది.

చాలా రోజులుగా లేని ముఖాముఖి

చాలా రోజులుగా లేని ముఖాముఖి

ఈ మధ్య చంద్రబాబు ప్రధాని మోడీల మధ్య భేటీ జరగలేదు. అదే సమయంలో ప్రతిపక్ష నేత, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఐదారు నెలల క్రితం మోడీ అపాయింటుమెంట్ ఇచ్చారు. అప్పుటి నుంచి బిజెపి - వైసిపి దగ్గరవుతుందా అనే చర్చ సాగుతోంది. తాజాగా, మరోసారి చంద్రబాబుకు అపాయింటుమెంట్ దొరకపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు ఏడాదిన్నరగా బాబు-మోడీలు ముఖాముఖి మాట్లాడుకోలేదని అంటున్నారు.

అదే జరిగితే బిజెపికి మైనస్

అదే జరిగితే బిజెపికి మైనస్

ఏపీకి కేంద్రం ఒప్పుకున్న ప్యాకేజీ, నిధుల గురించి చంద్రబాబు అడుగుతారనే బిజెపి అగ్రనేతలు అపాయింటుమెంట్ ఇవ్వకుంటే అది ఎప్పటికైనా టిడిపి నేతల ద్వారా వెలుగు చూస్తుందని, అప్పుడు అది బిజెపికే పెద్ద మైనస్ అవుతుందంటున్నారు. ఇప్పటికే హోదా విషయంలో ఇరుకునపడ్డ బిజెపి.. కేవలం నిధుల కోసం అపాయింటుమెంట్ నిరాకరిస్తే మరింత నష్టమే అంటున్నారు.

బిజెపి జగన్‌తో వెళ్తుందా, ఇవి సంకేతాలా?

బిజెపి జగన్‌తో వెళ్తుందా, ఇవి సంకేతాలా?

అయితే, చంద్రబాబు ఏపీకి రావాల్సినవి అడుగుతారని కాకుండా వారు బిజీగా ఉండటం వల్లనే అపాయింటుమెంట్ దొరకలేదని కమలనాథులు అంటున్నారు. అదే సమయంలో అసలు టిడిపిని వదిలి ఇతర నేతలతో వెళ్లే ఉద్దేశ్యం వారికి ఉందా అనే చర్చ సాగుతోంది. టిడిపి కూడా ఇప్పటి నుంచి బిజెపిని ఇరుకున పెట్టే ప్లాన్ అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బిజెపి జగన్‌తో వెళ్తుందా, ఇవి సంకేతాలా అని చర్చించుకుంటున్నారు.

English summary
For over the past one and a half years, AP CM Nara Chandrababu Naidu has not had the chance for face to face meeting with the Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X