ఫ్యామిలీతో వెళ్లిన చంద్రబాబు, 10న జగన్ ఫ్యామిలీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి కోసం వెళ్లారు. గురువారం రాత్రి ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి వెళ్లారు.
వారు ముస్సోరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినప్పటికీ సార్వత్రిక ఎన్నికల కారణంగా ఓట్ల లెక్కింపును నిలిపి వేశారు. కోర్టు ఆదేశాల మేరకు మే 12న ఎంపిటిసి, జెడ్పీటిసి, మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో ఆయన వేసవి విడిదిని నాలుగు రోజులకు పరిమితం చేసుకున్నారు. ముస్సోరిలో నాలుగు రోజుల పాటు గడిపి మే 12న చంద్రబాబు కుటుంబం తిరిగి హైదరాబాద్ రానుంది. మొదట ఆయన సింగపూర్ వెళ్తారని వార్తలు వచ్చాయి.

10 జగన్ డెహ్రాడూన్‌కు
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10వ తేదీన డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఉత్తరాంచల్లో కూడా పర్యటిస్తారు. ఈ నెల 10-15వ తేదీ వరకు ఆయనకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఎన్నికలు ముగిశాక విశ్రాంతి నిమిత్తం డెహ్రాడూన్, ఉత్తరాంచల్ వెళ్లడానికి జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. జగన్ పర్యటనల వివరాలను కోర్టుకు అందజేశారు.












Click it and Unblock the Notifications