కెసిఆర్ ప్రమాణం: బాబుకు ఆహ్వానం, మోడీపై తర్వాత
హైదరాబాద్: తెలంగాణా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం వెళ్లిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా కెసిఆర్‌కు ఆహ్వానం పంపిస్తారన్నారు. కెసిఆర్ ఆహ్వానికి అధికారికంగా చంద్రబాబుకు, మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం అందింది.
మోడీని తర్వాత ఆహ్వానిస్తాం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రానికి ఆహ్వానించనున్నట్టు కెసిఆర్ తెలిపారు. శనివారం కెసిఆర్ కొద్దిమంది జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ప్రధాని మోడీని ఇప్పటి వరకూ కెసిఆర్ కలవలేదనే అంశం చర్చకు వచ్చింది.

దీనిపై ఆయన మాట్లాడారు. తానింకా సిఎంగా బాధ్యతలు స్వీకరించలేదేని,. మోడీ వస్తే ఏ హోదాతో స్వాగతం పలకాలని కెసిఆర్ ప్రశ్నించారు. సిఎంగా ప్రమాణ స్వీకారం తరువాత, ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడిన తరువాత మోడీని ఆహ్వానించనున్నట్టు తెలిపారు.
మరో 15రోజుల్లో హైదరాబాద్‌లో ఒక సభను ఏర్పాటు చేసి దానికి మోడీని ఆహ్వానిస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, డిజిపిగా అనురాగ్ శర్మ పేరు ఖరారైనట్టు కెసిఆర్ వెల్లడించారు. జూన్ 2న కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.












Click it and Unblock the Notifications