చంద్రబాబు డబుల్ స్కాం: రంగంలో దిగిన మరో విభాగం- ఆధారాలతో సహా

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.

తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసులో ఐటీ శాక అధికారులు దర్యాప్తు సాగిస్తోన్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి.

Chandrababu IT notice Case: AP CID issues notice to Manoj Vasudev and Yogesh Gupta

చంద్రబాబు కోడ్ భాష వాడినట్లు తేలింది. 8,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపుల రూపంలో తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా 118 కోట్ల రూపాయలను తీసుకున్నారని, ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండటానికి కోడ్ లాంగ్వేజ్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో తాజాగా ఏపీ సీఐడీ అధికారులు కూడా రంగ ప్రవేశం చేశారు. ఆదాయపు పన్ను కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండింటి మూలాలు కూడా ఒకే చోట ఉన్నాయనే నిర్ధారణకు వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం- ఐటీ స్కాంలో ఒకే వ్యక్తులు ఉన్నారనే విషయం దర్యాప్తులో తేలింది.

దీనితో ఏపీ సీఐడీ అధికారులు తాజాగా మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేష్ గుప్తాకు నోటీసులు జారీ చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో యోగేష్ గుప్తాల ప్రమేయం ఉన్నట్లు తేలిన నేపథ్యంలో వారిద్దరికీ నోటీసులు ఇచ్చారు. ఇద్దరినీ కలిపి విచారించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+