రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో రూ.20,000 జమ

రైతులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు.అన్నదాత సుఖీభవ అమలుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్ర రైతులకు వచ్చే రోజులలో ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 6,000తో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మూడు విడతల్లో ఏప్రిల్‌లోనే మొదట విడతలుగా సుఖీభవ పథకాన్ని అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితో కలిసి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.రైతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు.

Chandrababu key statement on the implementation of Annadata Sukhibhava

గత ప్రభుత్వ అవ్యవస్థత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు.అన్నదాత సుఖీభవ అమలుతో రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు దీన్ని ఆశావహంగా చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు. మత్స్యకారులకు కూడా రూ.20,000 అందజేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పింఛన్ల రూపంలో ఏటా రూ.34,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని ఆయన పేర్కొన్నారు. అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+