అందరికీ 'కొంత' నగదు, మిగతా డిజిటల్: సామాన్యుడికి బాబు ఊరట మాట, జైట్లీ వరాలపై..

నోట్ల రద్దు తర్వాత నెల రోజులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వరాల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు.

న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత నెల రోజులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వరాల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు. నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలకు జైట్లీ ప్రోత్సాహకాలు ప్రకటించారని చెప్పారు.

నగదు రహిత లావాదేవీలకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నీతి అయోగ్ భేటీ జరిగింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఆధార్ రహిత లావాదేవీల పైన చర్చించినట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఇవాళ ఢిల్లీలో జరిగింది.

chandrababu naidu

సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ పనగారియా, వివిధ బ్యాంకుల సీఎండీలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పీవోఎస్‌ యంత్రాలు, కార్డుల ద్వారా డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామన్నారు.

ప్రతి వినియోగదారుడికి కొంత నగదు అవసరమని, కనీస నగదు మినహా మిగతా వ్యవహారాలన్నీ డిజిటల్‌ విధానంలోనే జరగాలన్నారు. డిజిటల్‌ లావాదేవీల విధివిధానాలపై చర్చించినట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలకు జైట్లీ ప్రకటించిన ప్రోత్సాహకాలు ఉపయోగపడతాయన్నారు.

ఆధార్‌ ఆధారిత లావాదేవీలపై చర్చించామని పనగారియా అన్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లతో లావాదేవీలు నిర్వహించవచ్చని, క్యూఆర్‌ కోడ్‌ విధానం అమలు చేయాలని బ్యాంకులను కోరామన్నారు. మైక్రో ఏటీఎంలను పెంచాలని ఆర్బీఐకి సూచించామన్నారు. డిజిటల్‌ లావాదేవీలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు.

జైట్లీతో కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, పెద్దనోట్ల రద్దు అంశాలపై చర్చించారని తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు పలువురు ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. జైట్లీతో కేసీఆర్ అరగంట పాటు భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+